Begin typing your search above and press return to search.
తేనెతుట్టె ప్రశ్నను పవన్ ఎలా డీల్ చేశారంటే..
By: Tupaki Desk | 11 Nov 2016 7:13 AM GMTనిజాయితీగా ఉండటమే నేరమా? అన్న భావన పలు సందర్భాల్లో అనిపించక మానదు. కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులు ఎవరూ నిజాయితీగా.. తమ మనసుల్లో ఉన్నది ఉన్నట్లుగా చెప్పటానికి ఏ మాత్రం ఇష్టపడరు. సమాజంలో బలంగా ఉన్న భావాల్ని ప్రశ్నించేలా.. వాటి మీద చర్చ జరిగేలా మాటలు చెప్పటానికి అస్సలు ఇష్టపడరు. రాజకీయం అంటే అధికారాన్ని అందుకోవటం.. పదవుల్ని చేపట్టటం.. పవర్ లోకి రావటమే ప్రాతిపదిక మాత్రమే తప్ప ప్రజా సంక్షేమం.. తన చుట్టూ ఉన్న సమాజాన్ని మార్చాలన్న లక్ష్యం ఎంతమాత్రం ఉండదు.
అందుకే.. వీలైనంతవరకూ వివాదాస్పదంగా మారే అవకాశం ఉంటే.. అలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పటం తర్వాత.. సంబంధం లేకుండా మాట్లాడి తర్వాతి ప్రశ్నలోకి వెళ్లిపోవటం కనిపిస్తుంది. అయితే.. అందుకు భిన్నంగా టచ్ చేయటం తర్వాత.. అ దరిదాపుల్లోకి వెళ్లేందుకు సైతం భయపడే రాజకీయ నేతలకు భిన్నంగా పవన్ కల్యాణ్ రిజర్వేషన్ల అంశంపై ఒక విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. తాను సంతృప్తికరమైన సమాధానం చెప్పలేనంటూ నిజాయితీగా అసలు విషయాన్ని చెప్పేసి ఆయన.. ఈ తరహా ప్రశ్న చాలా సున్నితమైనదన్న విషయాన్ని చెప్పటంతో పాటు.. తానీ విషయం మీద మాట్లాడితే అపార్థం చేసుకునే అవకాశం ఉందంటూ ముంచుకొచ్చే ప్రమాదం గురించి చెబుతూనే.. విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు.
ఇంతకీ రిజర్వేషన్లపై విద్యార్థి అడిగిన ప్రశ్న ఏమిటని చూస్తే..పోటీ పరీక్షల్ రిజర్వేషన్ల కారణంగా మెరిట్ విద్యార్థులకు అవకాశాలు లేకుండా పోతున్నాయి కదా? దీనిపై మీ సమాధానం ఏమిటన్న సవాలును సంధించారు. తేనె తుట్ట ను తట్టి రేపే ఈ తరహా ప్రశ్నకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసిన పవన్ ఆచితూచి మాట్లాడారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేడ్కర్ చెప్పిన మాటల్ని ఉటంకించారు. రిజర్వేషన్లను ఒకట్రెండు తరాలకు మాత్రమే అమలు చేయాలని.. ఆ తర్వాత సమీక్షించాలన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. ఈ విషయంపై తాను మాట్లాడితే అపార్థం చేసుకునే అవకాశం ఉందన్నారు.
తాను చాలా సున్నితమైన పరిస్థితుల్లో ఉన్నట్లు చెప్పిన పవన్.. రిజర్వేషన్ల విషయంపై ఏదో ఒక పార్టీ కాకుండా దేశంలోని అన్ని పార్టీలు కూర్చొని మాట్లాడాలని.. ప్రజాదర్బారులోనూ.. చట్టసభల్లోనూ చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. రిజర్వేషన్ ఉన్న కులాల గురించి కాదు కానీ రిజర్వేషన్లు లేని కులాలకు మాత్రం ఆర్థికంగా భరోసా కల్పించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాను కులాలు.. మతాలు.. ప్రాంతాల భావనలకుదూరంగా ఉంటానన్న పవన్.. తాను వాటిని దాటి వెళ్లినా కొందరు మాత్రం తనను కులానికి కట్టిపారేస్తారన్న ఆవేదనను వ్యక్తం చేశారు. తాను కులాల్ని గౌరవిస్తాను కానీ నెత్తికెక్కించుకోనంటూ ఓపెన్ గా చెప్పేశారు.
రిజర్వేషన్ల విషయంపై తనను అడిగిన ప్రశ్నకు ప్రస్తుతం తాను సంతృప్తికరమైన సమాధానం చెప్పలేనని.. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ప్రశ్నకు సమాధానం చెబుతానన్నారు. అసెంబ్లీ.. పార్లమెంటులో ఈ విషయం మీద చర్చ జరిగేలా చేస్తానని.. భవిష్యత్తులో సదరు విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తానని పవన్ చెప్పారు. తేనెతుట్టె అని తెలిసినా దాని దగ్గరకు వెళ్లటం.. దాన్ని టచ్ చేయటం.. కరెంట్ తీగ పట్టుకోవాలని కోరినప్పుడు నిజాయితీగా దాన్ని పట్టుకునే ప్రయత్నం చేసిన పవన్ కు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/