Begin typing your search above and press return to search.
యనమలకు ఓటేస్తారా? అని ప్రజలేమన్నారంటే?
By: Tupaki Desk | 4 Nov 2018 10:37 AM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎవరు విమర్శ చేసినా.. రియాక్ట్ అయ్యే కొద్దిమందిలో యనమల రామకృష్ణుడు ఒకరు. ఎటకారంతో పాటు.. అహంభావాన్ని తన మాటల్లో దట్టించే యనమలకు ఊహించని షాకిచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అదే పనిగా ప్రతిసారీ విమర్శలు చేసే యనమలకు ప్రజల్లో ఎలాంటి ఇమేజ్ ఉందన్న విషయాన్ని పవన్ చెప్పకనే చెప్పేశారు.
ఒక్క విమర్శ కూడా చేయకుండా ఆయన ఇలాకాలో ఆయన పరపతిపై భలేగా దెబ్బేశారు పవన్ కల్యాన్. తాజాగా తూర్పుగోదావరి జిల్లా తునికి వచ్చిన ఆయన.. జన్మభూమి ఎక్స్ ప్రెస్ రైల్లో ప్రయాణించిన సంగతి తెలిసిందే. తుని స్టేషన్లో దిగిన పవన్ ను చూసేందుకు భారీగా అభిమానులు పోటెత్తారు. ఆయన రాకతో తుని రైల్వే స్టేషన్ మొత్తం నిండిపోయింది. తుని స్టేషన్లో దిగిన పవన్.. అక్కడే ఉన్న హాకర్స్ తో మాట్లాడారు. వారి కష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు.
రోజంతా కష్టపడినా కుటుంబ పోషణ భారంగా మారుతుందని.. ఇన్నేళ్లుగా కష్టపడినా సొంతిల్లు లేదంటూ తమ కష్టాల గురించి ఏకరువు పెడుతూ తమ గోడును వినిపించారు. అక్కడ నుంచి గొల్ల అప్పారావు సెంటర్లో ఏర్పాటు చేసిన సభకు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యనమల రామకృష్ణుడుకు 30 ఏళ్లుగా పట్టం కట్టారని.. ఎన్నో కీలక పదవులు నిర్వహించారని చెప్పిన పవన్.. ఆయన ఎన్నికల్లో నిలబడితే ఓటు వేస్తారా? అని ప్రశ్నించారు.
పవన్ ప్రశ్నకు సమాధానంగా అక్కడి స్థానికులు ఓటు వేయమని కేకలు వేయటం కనిపించింది. తుని ప్రజలు తనపై కురిపించిన ఆదరాభిమానాల్ని తానెప్పటికీ మర్చిపోనని చెప్పిన పవన్.. కొత్త తరం కోసం జనసేన పుట్టిందని వెల్లడించారు. అధికారం చేతిలో ఉంది కదా అని కార్యకర్తల్ని వేధింపులకు గురి చేస్తే ఊరుకునేది లేదన్న పవన్.. 2019లో జరిగే ఎన్నికల్లో ఓటు అనే గాలివానలో రాబంధులు కొట్టుకుపోతాయని మండిపడ్డారు.