Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తికి ప‌వ‌న్‌... ద‌ళిత రైతుల‌కు హామీ

By:  Tupaki Desk   |   18 Jan 2017 4:38 PM GMT
అమ‌రావ‌తికి ప‌వ‌న్‌... ద‌ళిత రైతుల‌కు హామీ
X
హైదరాబాద్ లోని జనసేన పరిపాలన కార్యాలయంలో రైతులు జ‌న‌సేన అధినేత‌ - ప‌వ‌ర్ స్టార్‌ పవన్ కళ్యాణ్ ను కలిసి తాము ఎలా అన్యాయానికి గురవుతున్నామో వివరించారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ఒడ్డున వున్నకృష్ణ నది లంక గ్రామాలయిన ఉద్దండరాయునిపాలెం లింగాయపాలెం - తాళ్లయపాలెం - మందడం - రాయపూడి - బొర్రుపాలెం - వెంకటపాలెం - ఉండవల్లి లంక గ్రామాలకు చెందిన 3,500 ఎకరాలను అమరావతి నిర్మాణం లో భాగంగా ప్రభుత్వం సేకరించిందని ద‌ళిత రైతులు వాపోయారు. ఇవన్నీ అసైన్డ్ భూములని తెలిపింది. 1954 - 1974 లో ప్రభుత్వం పట్టాలు ఇవ్వ‌గా ఈ భూములను గత నాలుగు తరాలుగా దళితుల‌మైన తాము సాగు చేసుకుంటున్నామ‌ని తెలిపారు. ఎక్కువ శాతం రైతులు ఎకరం లోపు ఉన్నవారే అయితే ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న భూములకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించడంలో తీవ్రమైన వివక్ష చూపుతోందని దళిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సేకరించిన భూములకు 50 వేలు కౌలు - 1450 గజాల స్థలం ఇస్తుండగా తమకు మాత్రం 600 గజాల స్థలం మాత్రమే ఇస్తామంటున్నారని, అది కుడా లాటరీ పద్దతిలో కాకుండా ఎక్కడో తమకు ఇష్టమయిన చోట ఇస్తామని చెబుతున్నారని ద‌ళిత రైతులు వాపోయారు.

దళితులు ఇప్పటివరకు వివక్షకు గురవుతూ ఊరికి చివరే వుంటున్నారని,ఇప్పుడు కుడా తాము రాజధానికి చివరనే ఉండాలా అని పశ్నిస్తున్నారు. దళితుల పట్ల ఇటువంటివివక్ష బ్రిటిష్ కాలంలో కుడా లేదని విమర్శిచారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తమ సమస్య తీసుకువెళితే పరిష్కారం దొరుకుతుందని ఆశలో వచ్చామని చెప్పారు. తమ గ్రామాలకు వచ్చి తమకు న్యాయం జరిగేలా చూడాలని దళిత రైతులు కన్నీటిలో ఆహ్వానించారు. ఇదే స‌మ‌యంలో పశ్చిమగోదావరి జిల్లా పోలవరం శివారుమూలలంక రైతులు సైతం త‌మ‌ కష్టం వెళ్ల‌డించుకున్నారు. ఈ గ్రామంలోని 207 ఎకరాలు బలవంతపు అన్యాక్రాంతంలో వున్నాయి.148 సన్నచిన్నకారు రైతులకు చెందిన ఈ భూముల్లో పోలవరం ప్రాజెక్ట కోసం తవ్వగా వచ్చిన మట్టిని ఈ 207 ఎకరాల్లో ప్రాజెక్టు కాంట్రాక్టర్ పోస్తున్నాడు. నిజానికి ఈ మట్టిని ప్రాజెక్టు కు దూరంగా కేటాయించిన 400 ఎకరాల బీడు భూముల్లో పోయవలసి వుంది. అయితే అక్కడకు రవాణా చార్టీలు ఎక్కువ అవుతాయన్న కారణంగా పక్కనే వున్న విలువయిన మాగాణి భూమిలో మట్టిని కాంట్రాక్టర్ పోసేస్తున్నాడు. ఇదెక్కడి అన్యాయమని ప్రశ్నిస్తే పలికి వారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కలెక్టర్ నుంచి ఇరిగేషన్ మంత్రి వరకు ఎవరిని కలిసినా తమకు న్యాయం జరగడం లేదని మొరపెట్టుకున్నారు. మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం ఇవ్వమని కోరిన ఫలితం లేదని చెప్పారు.

దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అబివృద్ధి ప్రజా సంక్షేమం రెండు జనసేన ముఖ్య విధానాలని అన్నారు. అబివృద్ధి పనులు ఆగకూడదని అలాగే ప్రజలు నష్టపోకూడదని అన్నారు. వృత్తుల ఆధారంగా ఏర్పడిన మన కుల వ్యవస్థలో ప్రభుత్వం తీసుకునే కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల కుల మూలాలకు నష్టం కలిగే అవకాశం ఉందని, దీనివల్ల కులాల మధ్య ఘర్షణలు జరిగే ప్రమాదం ఉందని కళ్యాణ్ భయాన్ని వ్యక్తం చేసారు. అందువల్ల ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకునే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ రెండు ప్రాంతాల రైతులు ఇచ్చిన విజ్ఞాపన పత్రాలను కూలంకషంగా పరిశీలించి, పార్టీలో చర్చించి ఏమి చేయాలో నిర్ణయిస్తామని చెప్పారు. తన రాక అవసరమైన పక్షంలో పై రెండు ప్రాంతాలలో పర్యటిస్తానని ప‌వ‌న్‌ హామీ ఇచ్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/