Begin typing your search above and press return to search.

ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో పవన్ కళ్యాణ్

By:  Tupaki Desk   |   22 Dec 2022 3:50 PM GMT
ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో పవన్ కళ్యాణ్
X
జనసేన వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసుకు పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్లారు. ఇప్పటికే వారాహి వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించారు. ఏపీలో యాత్రకు సిద్ధమవుతోన్న జనసేనాని ముందుగా తన క్యాంపెయిన్ కు సంబంధించిన మరికొన్ని వాహనాలను కూడా సిద్ధం చేసుకుంటున్నారు. వాటికి రిజిస్ట్రేషన్ చేయించారు పవన్.

ఉదయం 10 నుంచి మధ్యాహ్నం వరకూ రష్ ఉంటుందని.. ఇలాంటి సమయంలో పవన్ వస్తే అభిమానులను ఆపడం కష్టమని భావించి పవన్ కు సాయంత్రం పూట రావాలని ప్రత్యేకంగా స్లాట్ ఇచ్చారు రవాణాశాఖ అధికారులు దీంతో సాయంత్రం ఆర్టీఏ కమిషనర్ ను ఖైరతాబాద్ కు వచ్చి మరీ పవన్ కలిశారు. జనసేన వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ అధికారులను పవన్ కళ్యాణ్ కలిసి అందుకోసం ఫొటోలు దిగి డిజిటల్ సైన్ చేశారు.

మొత్తం ప్రచార రథంతోపాటు 6 వాహనాలకు పవన్ కళ్యాణ్ రిజిస్ట్రేషన్ చేయించారు. రిజిస్ట్రేషన్ క్రితం వారం క్రితం పవన్ కళ్యాణ్ స్లాట్ బుక్ చేసుకున్నారు.

పవన్ కళ్యాణ్ ఈనెల 7వ తేదీన సోషల్ మీడియాలో తన ప్రచార రథం ‘వారాహి’ని పోస్ట్ చేశారు. తాను ప్రచారం చేసేది ఈ వాహనంపైనుంచే అని ఫొటోలు వీడియోలు షేర్ చేశారు. అయితే వాహనం రంగుపై వైసీపీ నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. పవన్ వాహనంపై ఉన్న ఆలివ్ గ్రీన్ కలర్ ను డిఫెన్స్ వాహనాలు మినహా ఇతర వాహనాలకు ఉపయోగించకూడదని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. కేంద్రమోటార్ చట్టం ఇదే విషయాన్ని స్పష్టంగా చెబుతుందని అన్నారు. అదే రంగు ఉంటే వాహనం రిజిస్ట్రర్ అవ్వద్దని చెప్పారు. పవన్ కళ్యాణ్ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు.

అయితే ఏపీ వైసీపీ నేతల ఆరోపణలను తోసిరాజని తెలంగాణ రవాణా శాఖ అధికారులు పవన్ కళ్యాణ్ వాహనాలకు రిజిస్ట్రేషన్ తంతును దిగ్విజయంగా పూర్తి చేయడం విశేషం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.