Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ యాత్ర విరామం వ్యూహాత్మ‌క‌మేనా?

By:  Tupaki Desk   |   10 Jun 2018 4:24 AM GMT
ప‌వ‌న్ యాత్ర విరామం వ్యూహాత్మ‌క‌మేనా?
X
రోటీన్ కు భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌టం.. అంద‌రిలా తాను ఎందుకు ఉండాల‌న్న మౌలిక ప్ర‌శ్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌ను తాను వేసుకుంటారా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. రాజ‌కీయ పార్టీని పెట్టిన ప‌వ‌న్‌.. దాని ప్ర‌క‌ట‌న‌ల మొద‌లు ఈ రోజు వ‌ర‌కూ స‌ద‌రు పార్టీకి అన్నీ తానై వ్య‌వ‌హ‌రిస్తున్న వైనం తెలిసిందే.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఇంచుమించు ఏడాది ముందు పోరాట యాత్ర పేరుతో ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో ప‌ర్య‌టిస్తున్న ప‌వ‌న్‌.. ఇప్ప‌టికే ప‌లుమార్లు విరామం తీసుకోవ‌టం తెలిసిందే. యాత్ర‌ను నిరాటంకంగా కొన‌సాగించ‌కుండా.. ఏదో కార‌ణం పేరుతో ఎప్ప‌టిక‌ప్పుడు యాత్ర‌కు బ్రేకులు ఇవ్వాల‌న్న వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. రంజాన్ సంద‌ర్భంగా వారం రోజులు త‌న యాత్ర‌కు బ్రేక్ ను ఇచ్చారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌.

త‌న వ్య‌క్తిగ‌త సిబ్బందిలో ఎక్కువ మంది ముస్లింలు ఉండ‌టం.. రంజాన్ ప‌ర్వ‌దినం నేప‌థ్యంలో వారికి వారం సెల‌వులు ప్ర‌క‌టించిన‌ట్లుగా చెబుతున్నారు. యాత్ర‌కు ఇన్నేసి బ్రేకులు వేసుకోవ‌టం వెనుక ఆస‌క్తిక‌ర వ్యూహం ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

ఎక్క‌డిక‌క్క‌డ స్థానిక అంశాల మీద ప‌ట్టు పెంచుకోవ‌టానికి.. స్థానిక రాజ‌కీయ అంశాల్ని వివిద వ‌ర్గాల వారీగా చ‌ర్చ‌లు జ‌ర‌ప‌టం.. వారి అభిప్రాయాల్ని సేక‌రించ‌టం చేస్తున్న ప‌వ‌న్‌.. 2019 ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌ఫున ఎవ‌రెవ‌రిని బ‌రిలోకి దింపాల‌న్న అంశం పైనా క‌సర‌త్తు చేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. యాత్ర‌కు విరామం అన్న‌ది వ్యూహాత్మ‌క‌మే కానీ.. మ‌రింకేమీ లేద‌న్న మాట‌ను చెబుతున్నారు.

విమ‌ర్శ‌ల‌కు తెర తీయ‌కుండా యాత్ర పేరుతో నిర్వ‌హిస్తున్న పోరాట యాత్ర‌ను కంటిన్యూ చేస్తూనే.. టికెట్ ఆశావాహుల వివ‌రాలు.. స్థానికంగా రాజ‌కీయ స‌మీక‌ర‌ణలు ఎలా ఉంటాయి..? ప‌్ర‌త్య‌ర్థుల బ‌లాలు.. బ‌ల‌హీన‌త‌లు ఏమిట‌న్న మ‌దింపు చేస్తార‌ని చెబుతున్నారు. ఎక్క‌డైతే తాను యాత్ర‌కు గ్యాప్ ఇస్తారో.. అక్క‌డ వివిధ వ‌ర్గాల‌కు చెందిన వారితో భేటీలు కావ‌టం.. పార్టీ శ్రేణుల్ని స‌మాయుత్త ప‌ర్చ‌టం లాంటివి చేస్తున్న‌ట్లు చెబుతున్నారు.

ఒక ట్రెండ్ మాదిరి సాగుతున్న ప‌వ‌న్ యాత్ర‌కు బ్రేకులు వేస్తున్న‌ట్లుగా మారిన విరామాలు ఆద్యంతం పార్టీ ప్ర‌తిష్ఠ‌ను మ‌రింత పెంచే దిశ‌గా ప‌వ‌న్ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల బ‌లాబ‌లాల్ని స్థానంగానే .. ప‌వ‌న్ తెలుసుకోవ‌టానికి ఇష్ట‌ప‌డుతున్నారు. దీంతో.. యాత్ర‌ను ఎప్ప‌టిక‌ప్పుడు విరామ‌మిస్తేనే లాభ‌మ‌న్న‌ట్లుగా ప‌వ‌న్ భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. ఈ కార‌ణంతోనే పాద‌యాత్ర‌ను నిరాటంకంగా అన్న‌ట్లు కాకుండా.. ఎప్ప‌టిక‌ప్పుడు గ్యాప్ తీసుకొని మ‌రీ నిర్వ‌హిస్తున్నారు. ప‌వ‌న్ బ్రేకుల‌పై ప‌లు విమర్శ‌లు నిర్వ‌హిస్తున్నా.. ఇదంతా ప‌వ‌న్ వ్యూహం ప్ర‌కార‌మే సాగుతుంద‌న్ని ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.