Begin typing your search above and press return to search.
‘సన్నాసి మంత్రి’ అంటూ పవన్ ఫైర్.. అన్నయ్యకు స్వీట్ వార్నింగ్!
By: Tupaki Desk | 26 Sep 2021 3:37 AM GMTలెక్కంటే లెక్కే. ఒకరు ఎక్కువా కాదు.. మరొకరు తక్కువగా కాదు. జడ్జి సీట్లో కూర్చున్నప్పుడు తర తమ భేదం లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి. కానీ.. ఇలాంటి మాటలే తప్పించి.. చేతల్లో చాలా వరకు కనిపించవు. కానీ.. అందుకు భిన్నంగా అలాంటి తీరును ప్రదర్శించారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. జనసేన పార్టీ అధినేత అన్న ట్యాగ్ ను పక్కన పెట్టేస్తే..తాజాగా తెలుగు సినిమా పరిశ్రమ.. ముఖ్యంగా ఏపీలో థియేటర్లు ఓపెన్ కాకుండా ఎదుర్కొంటున్న సమస్య గురించి పవన్ ప్రస్తావించిన తీరు.. తెలుగు ఇండస్ట్రీకి ఎదురవుతున్న ఇబ్బందుల గురించి ఆయన గళం విప్పటమే కాదు.. ఏపీ సర్కారుపై విరుచుకు పడ్డారు.
చర్చలకు పిలిచి.. ఏటూ తేల్చని ఏపీ ప్రభుత్వాన్ని తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తెలుగు చిత్ర పరిశ్రమకుచెందిన పెద్దలు ఇటీవల మంత్రి పేర్ని నానితో భేటీ కావటం తెలిసిందే. ఈ సందర్భంగా బతిమిలాడుకున్న ధోరణిలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడారని.. కానీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదన్న మాట వినిపించింది. ఈ విషయాన్ని తాజాగా ప్రస్తావించిన పవన్ కల్యాణ్.. ఏపీ మంత్రిని పేరు ప్రస్తావించకుండానే 'సన్నాసి'.. 'సన్నాసి' అంటూ పలుమార్లు అనటమే కాదు.. తన అన్న మెతకదనం (మంచితనంగా పవన్ అభివర్ణించారనుకోండి) మీదా సుతిమెత్తగా విమర్శలు చేయటం ద్వారా.. ఎవరు చేయాల్సిన పని వారు చేయకుంటే.. తప్పు పట్టేందుకు వెనుకాడనన్న మాట చెప్పకనే చెప్పేశారు.
చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తిగా చెబుతున్నానని.. మన మీద ఎవరైనా దాడి చేస్తున్నప్పుడు బలంగా మాట్లాడాలని.. మాట్లాడే హక్కు ఉందన్న పవన్ కల్యాణ్.. 'మీరు దోపిడీలు చేయట్లేదు. దొమ్మీలు చేయటం లేదు. కష్టపడుతున్నారు. ఒక డాక్టర్ ఎలా కష్టపడుతున్నాడో మీరు అలానే కష్టపడుతున్నారు.చిత్ర పరిశ్రమ అంటే ఒక దిల్ రాజు కాదు.. ఒక అల్లు అరవింద్.. సురేశ్ బాబుకాదు. చాలామంది ఉన్నారు' అని వ్యాఖ్యానించారు.
తన మీద కోపంతో ఏపీ అధికారపక్షం సినిమాలు ఆపేస్తే.. లక్షలాది మంది పొట్ట కొట్టినట్లు అవుతుందన్నారు. ఈ సందర్భంగా ఏపీ మంత్రిపై ఘాటు విమర్శలతో పాటు.. తన సోదరుడు చిరంజీవి తీరును సుత్తిమెత్తగా తప్పు పట్టారు. ఆయన ఏమన్నారన్నది ఆయన మాటల్లోనే చూస్తే..
''పవన్ కల్యాణ్ మీద కోపంతో అక్కడ సినిమాలు ఆపేస్తే.. లక్ష మంది పొట్ట కొడుతున్నారు ఇక్కడ. ఒకవేళ మీకు నాతో గొడవ ఉంటే నా సినిమాలు ఆపేయండి. మా వాళ్లను వదిలేయండి. ఈ మధ్యన అన్నారు నాతో.. ఎందుకండి చిరంజీవి వాళ్లను బతిమిలాడుకుంటారు అని. నేను చెప్పాను.. ఆయనది మంచి మనసయ్యా. అలా బతిమిలాడుకుంటారని'' అని వ్యాఖ్యానించారు.
అక్కడెవరో మినిస్టర్ ఉన్నారు. పేరు మర్చిపోయాను అన్నంతనే జనాల నుంచి ఆ మంత్రి పేరు వచ్చినంతనే రియాక్టు అయిన పవన్.. 'ఆ.. సన్నాసే.. ఆ సన్నాసే. ఆ సన్నాసి పేరు గుర్తుకు రాలేదు. ఆ సన్నాసి అనే మాటేమంటే.. మా నాయకులకి చిరంజీవిగారంటే సోదర భావన.. సోదర భావన.. సోదర భావన ఏందిరా.. సోదిలో సోదర భావన. ఉపయోగపడని సోదర భావన.. చిత్రపరిశ్రమకు అక్కరకు రాని సోదర భావన దేనికి? దిబ్బలో కొట్టుకోవటానికా?' అంటూ తీవ్రంగా మండిపడ్డారు.
మీ అందరికి ఇబ్బంది ఉండొచ్చేమో నేను ఇలా మాట్లాడుతుంటే.. అంటూ వ్యాఖ్యానించిన పవన్.. అభిమానులు పెద్దగా స్పందిస్తుంటే.. 'ఏయ్.. మీకు కాదులే. మీకు.. నాకు ఇబ్బంది ఏముంటుంది? మనలో మనం గొడవపడతాం. మన గురించి కాదు' అంటూ ఫ్యాన్స్ ను ఉత్తేజపర్చారు.
తానుఇలా మాట్లాడుతుంటే.. చిత్రపరిశ్రమను మొత్తం ఆపేస్తారంటున్నారన్న ఆయన.. వైసీపీ నాయకులు ఎలాంటి వాళ్లో తాను చెబుతానంటూ.. 'ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడ్నే వారు క్షమించలేదు.. అంత నీచంగా మాట్లాడారు. భారతదేశపు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీదనే దాడికి పాల్పడిన వారు.. వీరికి చిత్రపరిశ్రమ ఒక లెక్కా? వాళ్ల లక్షకోట్ల ముందు తిప్పి కొడితే రెండు వేల కోట్లు.. నాలుగు వేల కోట్లు ఉండే తెలుగు చిత్ర పరిశ్రమ వారికో లెక్కా? మనం పగటి కలను కనొద్దు. మొన్న కూడా ఆ సన్నాసి మినిస్టర్ తోటి మీటింగ్ చేశారు కదా? ఆ సన్నాసికి చెప్పండి.. పవన్ కల్యాణ్ సినిమాను ఆపేసి.. మిగిలిన వారిని వదిలేయమని చెప్పండి. మీరు అనుకోవచ్చు.. అన్నా.. మిగిలిన వారి సినిమాల్ని వదిలేసి.. మన సినిమాను ఆపేస్తే ఎలా అని? ఎవడ్రా.. మన సినిమాల్ని ఆపేదక్కడ? వీళ్లు ఆపితే చూస్తూ ఊరుకుంటామా?' అని మండిపడ్డారు. గట్టిగా మాట్లాడాలని.. మాట్లాడకుండా ఉంటే ఎలా? అని తన సోదరు చిరంజీవిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.