Begin typing your search above and press return to search.
పీకే సాబ్!... బీకాంలో పిజిక్స్ ను మరిపిస్తున్నారే!
By: Tupaki Desk | 9 March 2019 1:57 PM GMTఅప్పుడెప్పుడో బీకాంలో ఫిజిక్స్‌ను చదివానంటూ టీడీపీలోకి జంప్ కొట్టిన వైసీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ చేసిన కామెంట్ తెగ వైరల్ అయిపోయింది. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను బీకాంలో ఫిజిక్స్ చదివానంటూ జలీల్ ఖాన్ చెప్పారు. బీకాంలో ఫిజిక్స్ ఎలా ఉంటుంది సార్ అంటూ సదరు ట్యూబ్ ఛానెల్ రిపోర్టర్ వారించినా... ఎందుకుండదు? ఉంటుంటుంది అంటూ జలీల్ ఖాన్ తనదైన శైలిలో ఆన్సరిచ్చేశారు. ఆ తర్వాత జలీల్ ఖాన్ ను అంతా ఆయన పేరుతో కాకుండా బీకాంలో ఫిజిక్స్ అనే పిలవడం మనకు తెలిసిందే. ఇప్పుడు బీకాంలో ఫిజిక్స్ కంటే మించిన కామెడీ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తాను జలీల్ ఖాన్ కంటే కూడా కామెండీ పంచగలనంటూ సరికొత్త కామెంట్లు చేశారు. పవన్ నుంచి ఈ తరహా కామెంట్లు రాగానే... సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయననున ఓ ఆటాడేసుకుంటున్నారు.
అయినా పవన్ ఏమన్నారంటే... ఇటీవల జిల్లాల పర్యటనలకు వెళ్లిన పవన్... ఇంటర్మీడియట్ లో తాను చదివిన కోర్సును ప్రస్తావిస్తూ... మూడు సభల్లో మూడు మాటలు చెప్పేశారు. ఈ మూడు మాటలు కూడా పవన్ మూడు కోర్సులు చేసినట్టుగా ఉన్నాయి. తొలుత నెల్లూరులో చేసిన ప్రసంగంలో తాను ఇంటర్ లో సీఈసీ చదివానని చెప్పిన పవన్... ఆ కోర్సులో సీటు కోసం ఏకంగా రికమెండేషన్ చేయించుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఆ తర్వాత మరో సభలో మాట్లాడిన పవన్... తాను ఇంటర్ లో ఎంఈసీ చదివానని, టెన్త్ లో తక్కువ మార్కులు రావడంతో చేసేది లేక ఎంఈసీలో జాయిన్ అయ్యానని చెప్పుకొచ్చారు. ఇక ఈ రెండు కామెంట్లకు హైలెట్ అన్నట్టుగా తాను ఇంటర్ లో ట్యూషన్ కు వెళ్లానని, ఎంపీసీలో చేరినందున ట్యూషన్ తప్పలేదన్నట్లుగా కలరింగ్ ఇచ్చారు.
సోషల్ మీడియా తనదైన శైలి యాక్టివేషన్‌లో ఉన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు నెటిజన్లను దాటి వెళ్లలేవు కదా. ఆ క్రమంలోనే పవన్ నోట నుంచి వచ్చిన ఈ మూడు కామెంట్లను ఒకే వీడియోలో పేర్చేసిన నెటిజన్లు... పవన్‌ను ఓ ఆటాడేసుకుంటున్నారు. అసలే ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు దగ్గరపడిన సమయంలో... నిత్యం తమపై విరుచుకుపడుతున్న జనసైనికులను టార్గెట్ చేసిన వైసీపీ, టీడీపీ... చేతికందిని పవన్ కామెంట్లను ఆధారం చేసుకుని జనసేనపై తమదైన శైలిలో ట్రోల్ చేస్తున్నారు. పవన్ వ్యాఖ్యలను సర్దిచెప్పేందుకు జనసైనికులు చేస్తున్న యత్నాలు ఏమాత్రం పనిచేయడం లేదట. సో... ఈ దఫా జలీల్ ఖాన్‌కు బదులుగా పవన్ దెబ్బైపోయారన్న మాట.
వీడియో కోసం క్లిక్ చేయండి