Begin typing your search above and press return to search.
లోకేశ్ కు మైండ్ బ్లాంక్ అయ్యేలా పవన్ సవాల్
By: Tupaki Desk | 8 July 2018 1:38 PM GMTమాటల ఘాటు అంతకంతకూ పెంచుతున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఏపీ ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న ఆయన.. లోకేశ్ ప్రస్తావన వస్తే చాలు విపరీతంగా మండిపడటం స్పష్టంగా కనిపిస్తుంటుంది. బాబును కాస్తో కూస్తో అయినా వదిలేస్తారేమో కానీ.. లోకేశ్ విషయంలో మాత్రం పవన్ ఫుల్ ఫైర్ కావటం తెలిసిందే.
పార్టీ ఆవిర్భావ సభలోనూ లోకేశ్ మీద పవన్ చేసిన వ్యాఖ్యలు ఎంతలా సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు.
తాజాగా చినబాబుపై మరోసారి విరుచుకుపడ్డారు పవన్. దమ్ముంటే లోకేశ్ తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు. అదే పని లోకేశ్ చేస్తే.. తమ పార్టీ తరఫున ఒక కార్యకర్తను పోటీకి దింపుతామని.. ఎవరు గెలుస్తారో చూద్దామన్నారు.
దొడ్డి దారిన లోకేశ్ ను మంత్రిగా చేశారన్న ఆయన.. చినబాబును ముఖ్యమంత్రిని చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. రాజీనామా సవాల్ ను విసిరిన పవన్ అక్కడితో ఆగకుండా.. ఇచ్చాపురం మొదలు అనంతపురం వరకూ ఏ సమస్య పైనైనా సరే.. చర్చించేందుకు తాను సిద్ధమని తనతో లోకేశ్ బహిరంగ చర్చకు సిద్దమా? అని ప్రశ్నించారు. చూస్తూ.. చూస్తూ లోకేశ్ తో పోటీ పడటం ఏమిటి పవన్? ఆయనకు విషయాల మీద ఎంత అవగాహన ఉందో ఆయన మాటలే చెబుతాయి. అలాంటి దానికి మళ్లీ ఛాలెంజ్ చేసుడేంది?