Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ టోన్ మారిందేంటి చెప్మా..!

By:  Tupaki Desk   |   31 Aug 2019 1:40 PM GMT
ప‌వ‌న్ టోన్ మారిందేంటి చెప్మా..!
X
శ‌త్రువుకు శ‌త్రువు.. మిత్రుడ‌ని అంటారు! రాజ‌కీయాల్లో ఇది బాగా వినిపించే మాట‌!! ఇప్పుడు ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు కూడా ఇలానే క‌లిసి వ‌స్తున్న నాయ‌కుల సంఖ్య పెరుగుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా రాజ‌ధాని ప్రాంతంలో ప‌ర్య‌టించిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న వ్యాఖ్య‌ల‌ను స‌రిచేసుకున్నారు. గ‌తంలో చంద్ర‌బాబు అధికారంలో ఉన్న స‌మ‌యంలో రాజ‌ధాని ప్రాంతంపై ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు. రైతుల నుంచి భూములు బ‌లవంతంగా తీసుకుంటున్నార‌ని, దీనిని తాను ఖండిస్తున్నాన‌ని - అస‌లు రాజ‌ధానికి ఇంత భూమి అవ‌స‌ర‌మా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

అంతేకాదు, రాజ‌ధానిలో టీడీపీ పెద్ద‌లు కూడా భూములు తీసుకుంటున్న‌ట్టు త‌న‌కు స‌మాచారం ఉంద‌ని - స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు తాను బ‌య‌ట పెడ‌తాన‌ని అన్నారు. క‌ట్ చేస్తే. ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ ఇదే ప‌నిచేస్తోంది. భూములు భోంచేసిన వారిని వెతికి ప‌ట్టుకుని - కూపీలాగి వారి బాగోతాన్ని ఎండ‌గ‌ట్టే ప‌ని ప్రారంబించింది. మ‌రి గ‌తంలో చేసిన వ్యాఖ్య‌లకు క‌ట్టుబ‌డి .. ఇప్పుడు వైసీపీ చేస్తున్న ప‌నిని స్వాగ‌తించాల్సిన ప‌వ‌న్‌.. అనూహ్యంగా త‌న గ‌ళాన్ని స‌వ‌రించుకున్నారు. రాజ‌ధానికి ఇచ్చిన భూములు ఏ పార్టీకో ఇచ్చిన‌వి కావ‌ని అన్నారు.

రాజు మారిన‌ప్పుడ‌ల్లా రాజ‌ధాని మారుతుందా? అని ప్ర‌శ్నించారు. నిజ‌మే ఆయ‌న ఆవేద‌న లో అర్ధ‌ముంది. కానీ, నిర్దిష్ట‌మైన సూచ‌న‌లు లేకుండానే - రాజ‌ధానిపై వేసిన శిమ‌రామ‌కృష్ణ క‌మిటీ ఇచ్చిన నివేదిక‌ను ప‌రిశీలించ‌కుండానే ముందుకు వెళ్లిన చంద్ర‌బాబును ఆయ‌న అప్ప‌ట్లో ఎందుకు నిల‌దీయ‌లేదో కూడా స‌మాధానం చెప్పి ఉండాల్సింది. ఇప్పుడు అఖిల ప‌క్షంతో మాట్లాడాల‌ని జ‌గ‌న్‌ కు సుద్దులు చెబుత‌న్న ప‌వ‌న్‌.. నాడు చంద్ర‌బాబు ఎవ‌రికి సంప్ర‌దించి అమ‌రావ‌తిని ప్రారంభించారో చెప్పాల‌ని అంటున్నారు సాధార‌ణ ప్ర‌జ‌లు.

ప్ర‌భుత్వం మారిపోగానే ప్రాధాన్యాలు మార్చుకుంటున్న‌ది ఎవ‌రో కూడా పెద్ద‌గా చెప్పా ల్సిన అవ‌స‌రం లేద‌ని అంటున్నారు. మొత్తానికి ప‌వ‌న్ వ్యాఖ్య‌లు ఇప్పుడు కూడా బాబును స‌మ‌ర్ధిస్తున్నట్టుగా ఉండ‌డం ఒకింత ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తున్నాయ‌ని అంటున్నారు.