Begin typing your search above and press return to search.

క్రిస్మస్ వేడుకులకు అత్తారింటికి వెళ్లిన పవన్

By:  Tupaki Desk   |   26 Dec 2019 4:32 AM GMT
క్రిస్మస్ వేడుకులకు అత్తారింటికి వెళ్లిన పవన్
X
అత్తారింటికి దారేదన్న పవన్ సినిమా ఎంతటి హిట్ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తాజాగా అత్తారింటికి వెళ్లిన పవన్ కల్యాణ్ వార్తల్లో నిలిచారు. గడిచిన కొద్ది రోజులుగా రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్న పవన్.. తాజాగా కాస్త బ్రేక్ ఇస్తూ రష్యాకు వెళ్లారు. తన సతీమణి అన్నా లెజనోవాది రష్యా కావటం.. ఆమె క్రిస్టియన్ కావటంతో క్రిస్మస్ వేడుకల్ని అత్తారింట్లో చేసుకోవటానికి వీలుగా వెళ్లినట్లుగా చెబుతున్నారు.

దీనికి సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉంటున్న పవన్.. తన డ్రెస్సింగ్ ను ఎలా మొయింటైన్ చేస్తున్నారో తెలిసిందే. అందుకు భిన్నంగా టక్ చేసి.. షూ వేసి.. క్లీన్ షేవ్ కు దగ్గరగా ఉంటూ స్టైలీష్ లుక్ లో తన భార్యతో కలిసి ఎయిర్ పోర్టు లో వెళుతున్న ఫోటో బయటకు వచ్చింది.

ఇక్కడ ఉన్నప్పుడు చీరలో మాత్రమే కనిపించే పవన్ సతీమణి.. తాజాగా బయటకు వచ్చిన ఫోటోలో మాత్రం మోడ్రన్ వేషధారణలో కనిపించారు. ఏపీ అధికారపక్షంపై తరచూ విమర్శలు చేయటం ద్వారా తన స్థానాన్ని సుస్థిరం చేసేందుకు పవన్ కిందా మీదా పడుతున్నారన్న వ్యాఖ్యలు ఉన్నాయి. తాను హిందువు అయినప్పటికి తన భార్య క్రిస్టియన్ కావటం.. ఆమె పండుగకు ఆమెకు నచ్చిన రీతిలో వెళ్లిన వైనాన్ని పలువురు ప్రశంసిస్తుంటే.. మరికొందరు తప్పు పడుతున్నారు. క్రిస్మస్ వేడుకుల కోసం రష్యా వెళ్లిన పవన్ ప్రైవేటు టూర్ ఇప్పుడు ఆసక్తికరంగా మారి.. అందరి నోట నానేలా చేసిందని చెప్పక తప్పదు.