Begin typing your search above and press return to search.

అవంతి హీరో అవుతారా? జీరో అవుతారా?

By:  Tupaki Desk   |   9 Sep 2016 6:36 PM GMT
అవంతి హీరో అవుతారా? జీరో అవుతారా?
X
సీమాంధ్రలో మరే నేతకూ దక్కని బంఫర్ ఆఫర్ అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ కు దక్కింది. కాకినాడలో జనసేనాధిపతి నిర్వహించిన ‘సీమాంధ్రుల ఆత్మగౌరవ సదస్సు’లో ఆవేశంగా మాట్లాడిన పవన్ కల్యాణ్ అవంతికి అద్భుతమైన ఆఫర్ ఇచ్చారు. తాను రాజీనామా చేస్తానని.. తన స్థానంలో పవన్ ను ఎంపీగా పోటీ చేయాలన్న అవంతి శ్రీనివాస్ మాటల్ని ప్రస్తావిస్తూ.. తాను నిజంగా ఎంపీ కావాలన్న ఆలోచనే ఉంటే ప్రజారాజ్యంలోనే పోటీ చేసే వాడినని.. తనకు పదవులు అక్కర్లేదన్న ఆయన.. అవంతి శ్రీనివాస్ కానీ తన పదవికి రాజీనామా చేస్తే.. ఆయన్ను గెలిపిస్తామన్నారు.

ప్రత్యేక హోదా అంశం మీద పోరాడుతున్న పవన్ కల్యాణ్ కు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే ఒక అయుధం కావాలి. అందుకు ఉప ఎన్నిక కానీ వస్తే.. ఆ ఎన్నిక ద్వారా ప్రజాతీర్పు ఏమిటన్నది చేతల్లో చేసి చూపించాలని పవన్ భావిస్తున్నట్లున్నారు. అందుకే అవంతిని తన ఎంపీ పదవికి రాజీనామా చేయగలరా? అని కోరారు. ఒకవేళ తన మాటతో అవంతి శ్రీనివాస్ కనుక తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తే.. తానే స్వయంగా అనకాపల్లి వచ్చి.. ప్రచారం చేసి గెలిపిస్తానని.. ఆయన్ను గెలిపించే బాధ్యత తనదంటూ పవన్ చేసి వ్యాఖ్యను చూస్తే.. ఆయన వ్యూహం ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

సీమాంధ్రుల తీర్పును ఢిల్లీకి వినిపించేలా చేయటం కోసం.. ఉప ఎన్నికను ఒక అవకాశంగా వాడుకోవాలన్నది పవన్ ఆలోచనగా కనిపిస్తోంది. అందుకే అవంతికి అవకాశం ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. ఒకవేళ పవన్ ఇచ్చిన ఆఫర్ కు సానుకూలంగా స్పందించిన పక్షంలో హోదా కోసం పదవిని త్యాగం చేసిన నేతగా అవంతి శ్రీనివాస్ నిలవటమే కాదు.. సదరు ఉప ఎన్నిక ప్రత్యేక హోదా మీద సీమాంధ్రుల వాణిని వినిపించేందుకు వీలుగా వినియోగించుకునే వీలుంది. ఒకవేళ పవన్ మాటకు స్పందించి తన పదవికి కానీ అవంతి శ్రీనివాస్ రాజీనామా చేస్తే.. ఏపీలోని మిగిలిన ఎంపీల మీద తీవ్ర ఒత్తిడిని పెంచే వీలుంది. ఒకవేళ.. పవన్ మాటకు అవంతి స్పందించకుంటే ఆయన తీవ్రంగానష్టపోయే ప్రమాదం ఉంది. పవన్ కల్యాణ్ తనకు తానుగా వెన్నంటి ఉంటానన్న భరోసా ఇచ్చిన తర్వాత కూడా అవంతి రియాక్ట్ కాకుంటే ఆయన జీరో కావటం ఖాయం. పవన్ ఆఫర్ కు రియాక్ట్ కాకుంటే ఆయన ఎప్పటికీ హోదా అంశం మీద తన వాణిని వినిపించే వీలు లేదని చెప్పొచ్చు. ఈ పరిస్థితుల్లో అవంతి ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికర అంశంగా చెప్పొచ్చు.