Begin typing your search above and press return to search.
ఏపీ మంత్రులను కడిగేసిన.. పవన్.. ఓ రేంజ్‌లో!
By: Tupaki Desk | 27 Oct 2022 4:13 AM GMTఏపీ ప్రభుత్వంపై ఇక యుద్ధమే.. అంటూ.. ఇటీవల వ్యాఖ్యానించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా.. మరింత రెచ్చిపోయారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని చెప్పిన ఆయన.. ఆ దిశగా అడగుల వేగం పెంచారు. ఈ క్రమంలో తాజాగా పవన్ సంధించిన ప్రశ్నలు మంత్రులకు సూటిగా తగులుతున్నాయి. ''మీకు కేటాయించిన శాఖలకు న్యాయం చేసేది ఏమైనా ఉందా? లేదంటే చౌకబారు విమర్శలతోనే పదవీ కాలమంతా వెళ్లదీస్తారా?'' అని పలువురు ఏపీ మంత్రులను నిలదీస్తూ జనసేన ట్వీట్ చేసింది.
వాస్తవానికి ఏపీ ప్రభుత్వంపై ఇప్పటికే జనసేన అధినేత విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీ నేతలు, ఏపీ మంత్రుల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే.. దీనికి మరింత బూస్ట్ ఇస్తూ.. తాజాగా జనసేన పార్టీ పలువురు మంత్రులపై ప్రశ్నల బాణాల్ని సంధించింది.
''మీకు కేటాయించిన శాఖలకు న్యాయం చేసేది ఏమైనా ఉందా? లేదంటే చౌకబారు విమర్శలతోనే పదవీ కాలమంతా వెళ్లదీస్తారా?'' అని నిలదీసింది. ఈ సందర్భంగా మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, జోగి రమేశ్, గుడివాడ అమర్నాథ్, ఆర్కే రోజా, విడదల రజనీ, దాడిశెట్టి రాజాలను ఉద్దేశిస్తూ ట్విటర్ వేదికగా జనసేనాని పవన్ కల్యాణ్ సంధించిన ప్రశ్నలు ఇవే..
+ ఏపీ అప్పుల చిట్టా ఎంతోలెక్క చెప్తారా? ఒక్కొ పౌరుడిపై ఎంత భారం మోపారోప్రజలకు వివరణ ఇవ్వగలరా బుగ్గన? అని ఆర్థిక మంత్రిని ప్రశ్నించారు.
+ పాఠశాలల్లో విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాల కల్పనకు ఎన్ని దశాబ్దాలు పడుతుందో సామాన్య ప్రజలకు అర్థమయ్యే భాషలో వివరించగలరా బొత్సా.. అని నిలదీశారు.
+ కొండలు చెరువుల్లో కాకుండా.. నివాసయోగ్యమైన భూముల్లో నాణ్యమైన ఇళ్లు ఎన్నికట్టించారో చూపగలవా.. జోగి.. అని ప్రశ్నించారు
+ నీ రికార్డింగ్ డాన్సులు అయిపోయాక ఖాళీగా ఉన్న సమయాల్లో నువ్వు కష్టపడి తీసుకువచ్చిన పరిశ్రమల గురించి శ్వేత పత్రం విడుదల చేయగలవా.. గుడివాడ? అని నిలదీశారు
+ మీ సహచర మంత్రులు అనారోగ్యానికి పక్కరాష్ట్రాలకు పారిపోకుండా ఏపీలోనే వైద్యం చేయించుకునే స్థాయి సదుపాయాలు ఎప్పుడు కల్పిస్తారు.. పబ్లిసిటీ క్వీన్ అని.. విడదల రజనీని ప్రశ్నించారు.
+ ఇంకెంతమందిని మీ గుంతల రహదార్లు బలితీసుకుంటే మొద్దు నిద్ర వీడతారో తెలపగలవా దాడిశెట్టి? అని దాడిశెట్టి రాజాను ప్రశ్నించారు.
+ పర్యాటక రంగం అభివృద్ధి కోసం.. ఇప్పటి వరకు నువ్వు చేసిన బృహత్ కార్యాలేమిటో ఏపీ ప్రజలకు సూటిగా చెప్పగల సత్తా ఉందా మహానటి రోజా.. అని నిలదీశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.