Begin typing your search above and press return to search.
పక్కనున్న వారి వల్లే ప్రజారాజ్యం దెబ్బతింది
By: Tupaki Desk | 10 Jan 2019 3:35 PM GMTఏపీ రాజకీయాల్లో జనసేనను బలంగా నిలిపేందుకు పవన్ కళ్యాణ్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. పూర్తిగా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ నేడు విజయవాడలోని జనసేన పార్టీ ఆఫీస్ లో కడప జిల్లాకు చెందిన జనసేన నాయకులు మరియు కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా నాయకులకు మరియు కార్యకర్తలకు దిశా నిర్థేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాలంటూ నాయకులకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చాడు.
ఏపీకి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే మళ్లీ సీఎం అవ్వాలని తెలుగు దేశం పార్టీ నాయకులు, జగన్ సీఎం అవ్వాలని వైకాపా నాయకులు అనుకుంటున్నారు. ఇలా ముఖ్యమంత్రి పదవి కోరుకునే వారికి చిత్తశుద్ది ఎలా ఉంటుంది. రాజకీయాలంటే వ్యాపారం అయ్యింది. కాని నేను మాత్రం రాజకీయాలంటే ప్రజా సేవ చేసేవిగానే భావిస్తాను. నాకు రాజకీయాలు వ్యాపారం కాదు. 2003 నుండి రాజకీయాల్లో ధన ప్రవాహం మరీ ఎక్కువ అయ్యింది. ప్రస్తుత రాజకీయాల్లో జనసేన కొత్త ఒరవడిని తీసుకు రావాలి. అందుకోసం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా వాటిని ఎదుర్కొనే సత్తా, ధైర్యం జనసేన శ్రేణులకు ఉన్నాయని పవన్ అన్నాడు.
తన అన్న ప్రజలకు సేవ చేయాలనే మంచి ఉద్దేశ్యంతో రాజకీయాల్లోకి వచ్చారు. కాని ఆయన పక్కన ఉన్న వారే నిరాశ పర్చారు, ఇప్పుడు అలాంటి పరిస్థితులు రాకుండా చూసుకుంటానన్నాడు. తెలంగాణలో గతంలో ఏర్పడిన పరిస్థితులు రాయలసీమలో ఏర్పడే అవకాశం ఉంది. రాయలసీమలో భవిష్యత్తులో ప్రమాదకర పరిస్థితులు ఎదరయ్యే అవకాశం ఉంది. వాటిని ప్రస్తుత పాలకులు పట్టించుకోవడం లేదన్నాడు.
నేను 2003లోనే రాజకీయాల్లోకి రావాలనుకున్నాను. దృడ సంకల్పంతో పార్టీని స్థాపించాను, వ్యక్తిగా బలపడేందుకు రాలేదు, వ్యవస్థను బలపర్చేందుకు రాజకీయాల్లోకి వచ్చానంటూ పవన్ పేర్కొన్నాడు. కడప జిల్లాకు చెందిన నాయకులు మరియు కార్యకర్తల నుండి అయిదుగురు సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లుగా పవన్ ప్రకటించాడు.