Begin typing your search above and press return to search.
పెందుర్తి ఎమ్మెల్యే చిట్టా విప్పిన పవన్
By: Tupaki Desk | 8 April 2019 4:45 AM GMTప్రత్యర్థి పార్టీ అధినేతలపై సీరియస్ విమర్శలు.. ఆరోపణలు చేయటం మామూలే. కానీ.. తాను పర్యటించే ప్రాంతాల్లోని స్థానిక ఎమ్మెల్యేలు.. ఇతర బలమైన రాజకీయ నేతలపై సీరియస్ వ్యాఖ్యలు చేయటం.. వారి వ్యక్తిగత చిట్టాల్ని విప్పటం లాంటివి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులో కానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిలో కానీ కనపించవు. ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తాను వెళ్లిన ప్రాంతాలకు చెందిన స్థానిక నేతలపై ఆయన తరచూ విమర్శలు.. ఆరోపణలు చేస్తుంటారు.
తాజాగా అలానే చేశారు పవన్. పెందుర్తిలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన పవన్ స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి.. ఆయన పుత్రరత్నం అప్పలనాయుడిపై సీరియస్ ఆరోపణలు చేశారు. పెందుర్తి ఎమ్మెల్యే రైతుల భూములు లాక్కున్నట్లుగా ఆయన ఆరోపించారు. రైతుల్ని భయభ్రాంతులకు గురి చేసి.. వారి చేత బలవంతంగా సంతకాలు చేయించి మరీ వారి భూములు లాక్కున్నట్లు మండిపడ్డారు. ఎమ్మెల్యే కొడుకు అప్పలనాయుడికి భయపడుతూ బతకాలా? అంటూ ఫైర్ అయ్యారు.
ఎమ్మెల్యేకు.. ఆయన కొడుక్కి భయపడుతూ బతకాల్సిన పరిస్థితి మారాలన్న ఆయన.. రోడ్డు కూడా వేయని బండారుకు ఎమ్మెల్యే పదవి ఎందుకు? అని ప్రశ్నించారు. పరవాడలో పరిశ్రమలు వెదజల్లే విషవాయువులతో పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారన్న పవన్.. ఈ కారణంగా ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారన్నారు.
అయితే.. ఎమ్మెల్యే మాత్రం పరిశ్రమల యజమాన్యాలతో కుమ్మక్కై సొమ్ములు తీసుకుంటూ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. సింహాచల దేవస్థాన భూ సమస్య పరిష్కారంలో ఎందుకు చొరవ చూపటం లేదో చెప్పాలన్న పవన్.. నియోజకవర్గంలో కనీసం డిగ్రీ కాలేజీని కూడా ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. తమ అభ్యర్థికి ఓట్లు వేసి గెలిపించాలని కోరే క్రమంలో.. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిలోని గుణాలను స్కాన్ చేసినట్లుగా.. చిట్టాను విప్పి మరీ ఓట్లు వేయొద్దని కోరటం పలువురిని ఆకట్టుకునేలా చేసింది. పవన్ మాటల ప్రభావం ఎంతన్నది తుది ఫలితం వచ్చిన తర్వాత కానీ తేలదు.