Begin typing your search above and press return to search.

డేటా చోరీ పై!... ప‌వ‌న్ మార్క్ కామెంట్ ఇదే!

By:  Tupaki Desk   |   6 March 2019 7:18 AM GMT
డేటా చోరీ పై!... ప‌వ‌న్ మార్క్ కామెంట్ ఇదే!
X
జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏ విష‌యంపై స్పందించినా... త‌న‌దైన స్టైల్ ఉండే ఉంటుంది. త‌న‌దైన స్టైల్ ముద్ర వేయ‌కపోతే ఆయ‌న సినీ న‌టుడు ఎలా అవుతారు చెప్పండి. ఐదేళ్ల క్రితం రాజ‌కీయ పార్టీని స్థాపించి... ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల పోటీకి సిద్ధ‌మ‌య్యేందుకు ఐదేళ్ల స‌మ‌యం తీసుకున్న ప‌వ‌న్‌... ఇప్పుడు జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల్లో కాస్తంత బిజీగానే ఉన్నార‌ని చెప్పాలి. రాయ‌ల‌సీమ‌లోని కర్నూలు - క‌డ‌ప‌ - చిత్తూరు జిల్లాల‌ను చుట్టేసిన ప‌వ‌న్‌... ఇప్పుడు నెల్లూరు - ప్ర‌కాశం జిల్లాల‌ను పూర్తి చేసేసి ఇప్పుడు గుంటూరు జిల్లాకు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన ఆయ‌న త‌న‌కు గుర్తుకు వ‌చ్చిన అన్ని అంశాల‌తో పాటు జ‌నాల నోళ్ల‌లో బాగానే నానుతున్న డేటా చోరీ అంశంపైనా త‌న‌దైన మార్కు స్పంద‌న‌ను తెలియ‌జేశార‌నే చెప్పాలి. టీడీపీని టీఆర్ ఎస్‌ - టీఆర్ఎస్ ను టీడీపీ... వైసీపీని టీడీపీ - టీడీపీని వైసీపీ ఇలా అన్ని దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లోని మూడు కీల‌క పార్టీలు జ‌ట్టు ప‌ట్టుకుని మ‌రీ కొట్టేసుకుంటున్నాయి. ఈ వైనంపై ప‌వ‌న్ త‌న‌దైన శైలి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌ తో పాటు టీడీపీ అధినేత చంద్ర‌బాబుల‌కు ఏకంగా వార్నింగిచ్చేసిన ప‌వ‌న్... వారిద్ద‌రికీ తాను ఒక‌టే చెబుతున్నాన‌ని - మీ ఇద్ద‌రు ఆడే రాజ‌కీయ ఆట‌ల‌తో ప్ర‌జ‌లు న‌లిగిపోతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ద‌య‌చేసి ఇక‌నైనా ఈ ఆట‌లు ఆపాల‌ని కూడా జ‌గ‌న్ వారిద్ద‌రికీ హిత‌వు చెప్పారు. ఎవరో ఎమ్మెల్యేలు - మంత్రులు చేసిన తప్పుకు ఆంధ్ర ప్రజలని కేసీఆర్ తిడుతున్నా సరే ఏపీ నాయకులకు పౌరుషం లేదని పవన్ మండిపడ్డారు. కేసులకు - దాడులకు భయపడేది లేదని చెప్పారు. మొన్న ఓటుకు నోటు - నిన్న నాగార్జునసాగర్ వద్ద రెండు రాష్ట్రాల పోలీసుల గొడవ - నేడు డేటా చోరీ.. ఇలా కేసీఆర్ - చంద్రబాబుల రాజకీయ చదరంగంలో ప్రజలు నలిగిపోతున్నారన్నారు. ఇద్దరు బలమైన నాయకులు గేమ్ ఆడుతున్నారని కూడా ప‌వ‌న్‌ ధ్వజమెత్తారు. ఆ త‌ర్వాత వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని టార్గెట్ చేసిన ప‌వ‌న్‌... తాను ఏం చెయ్యగలనో ఏది సాధ్యమో అదే మ్యానిఫెస్టోలో పెడుతున్నానని - అంతే గాని నవరత్నాలు - వజ్రాలు అని నేను అబద్దాలు చెప్పడం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పార్టీకి మరోపేరు వైసీపీ అని కూడా ప‌వ‌న్ కాస్తంత ఘాటు వ్యాఖ్య‌లే చేశారు.

ఇక కేసీఆర్ శ్లాంగ్ ఎదురు దాడిని ప్ర‌స్తావించిన ప‌వ‌న్‌... ఇక‌పై ఎంత‌మాత్రం సైలెంట్ గా ఉండేది లేద‌ని తేల్చేశారు. కేసీఆర్ ఉద్యమం సమయంలో చాలా తిట్టారని - ఉద్యమస్ఫూర్తిని అర్థం చేసుకొని భరించామని, విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య గొడవలు భరించే పరిస్థితిలో లేమని పవన్ అన్నారు. ఓ వైపు టీడీపీ తమతో కలిసి రావాలని పిలుస్తోందని, మరోవైపు తెరాస.. జగన్‌ ను - పవన్‌ ను కలుపుతామని చెబుతోందని - ఈ పొలిటికల్ గేమ్స్ చూసి విసుగు వచ్చిందన్నారు. వచ్చే ఎన్నికల్లో తాము లెఫ్ట్ పార్టీలతో తప్ప ఎవరితోను కలిసే ప్రసక్తి లేదన్నారు. వైసీపీ నాయకులు తమ ప్రచార రథంపై దాడి చేయించారని, టీడీపీ వారు పోలీసులు చేత తమ జన సైనికులను కొట్టించారని మండిపడ్డారు. అయినా తాను ఒక్కటే చెబుతున్నానని, ఇలాంటి తప్పుడు పనులు చేయవద్దని, అలా కాదు మీకు యుద్ధమే కావాలని మీరు అనుకుంటే మేం ఏమిటో.. మా బలం ఏమిటో చూపిస్తామని జగన్ - చంద్రబాబుకు ప‌వ‌న్‌ హెచ్చరికలు జారీ చేశారు. మొత్తంగా సింగిల్ స్పీచ్ లోనే ప‌వ‌న్‌... ఇటు చంద్ర‌బాబు - కేసీఆర్‌ ల‌తో పాటు జ‌గ‌న్ కూ వార్నింగిచ్చిన‌ట్టైంది.