Begin typing your search above and press return to search.
అన్నింటికి బాబు..జగన్ ను పిలుస్తావా పవన్?
By: Tupaki Desk | 8 July 2018 5:12 AM GMTఎవరు సలహాలు ఇస్తున్నారో కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెబుతున్న మాటలు కొన్ని ఆసక్తికరంగా మారుతున్నాయి. నాలుగు రోజులు జనాల్లో తిరగటం.. మళ్లీ వారం రోజులు కనిపించకుండా ఉండటం పవన్లో ఎక్కువగా కనిపిస్తుందన్న విమర్శ ఒకటి బలంగా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఉత్తరాంధ్ర సమస్యలపై పోరాడుతున్నట్లుగా మాటలు చెబుతున్న పవన్.. చేతల కంటే మాటలే ఈ మధ్యన ఎక్కువగా వినిపిస్తున్నట్లుగా చెప్పాలి.
విభజన హామీల్లో భాగంగా ఇచ్చిన విశాఖ రైల్వేజోన్ సాధన కోసం చిత్రమైన మాటను చెప్పారు పవన్. ఏదో వార్తల్లో కనిపించాలన్న ఆలోచనే తప్పించి.. ఇష్యూల్ని పోరాడి సాధించుకోవాలన్న తీరు పెద్దగా కనిపించటం లేదన్న మాట వినిపిస్తోంది.
విశాఖకు రైల్వేజోన్ సాధన కోసం ఏపీ రాజకీయ పార్టీలు ఎవరికి వారిగా ప్రకటనలు చేస్తున్న వైనం తెలిసిందే. విపక్ష అధినేత.. రైల్వే జోన్ సాధన కోసం చిత్రమైన ప్రతిపాదనను తీసుకొచ్చారు. రైల్వే సాధన కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. బాబు కుమారుడు కమ్ ఏపీ మంత్రి లోకేశ్ ను కూడా తీసుకురావాలని.. ముగ్గురు వస్తే.. తాను సైతం వస్తానని.. విశాఖలో రైళ్లను ఆపుదామంటూ ప్రతిపాదన చేశారు.
నలుగురం కలిసి రైళ్లను ఆపితే..ఆ ప్రభావం కేంద్రం మీద పడుతుందని.. ఆ పని చేయటానికి తాను సిద్ధమని.. ముగ్గురు నేతలు దీక్షకు రావాలన్న పవన్ తీరుచూస్తే.. రైల్వే జోన్ సాధన విషయంలో తానొక్కడే ఏమీ చేయలేనన్న విషయాన్ని చెప్పేశారని చెప్పాలి.
సీఎం పదవిని చేప్టటేందుకు సిద్ధమని చెబుతున్న పవన్.. సమస్యల్ని ఒంటరిగా పోరాడే విషయంలో మాత్రం తెగువను ప్రదర్శించటం లేదన్న విమర్శ ఉంది. సమస్యల పరిష్కారం కోసం బాబు.. జగన్ లు కలిసి రావాలని చెబుతున్న పవన్.. సీఎం పదవిని కూడా వారికే ఇచ్చేయొచ్చుగా? కలిసి సాధించాలన్న మాట అసాధ్యం కావటం.. అదే విషయాన్ని తరచూ చెప్పటం ద్వారా.. తాను ప్రయత్నం చేస్తున్నా.. మిగిలిన అధినేతలు సహకరించట లేదన్నట్లుగా తప్పు పట్టేలా పవన్ తన తాజా వాదనను వినిపించటం గమనార్హం. ఏపీకి రైల్వేజోన్ అంశంపై ఎంపీలు అవంతి.. మురళీమోహన్ కు వేళాకోళమైపోయిందన్న పవన్.. తన మాటలు కూడా అదే రీతిలో ఉన్నాయన్నది మర్చిపోకూడదు.