Begin typing your search above and press return to search.
వారసత్వ రాజకీయాలకు పవన్ మద్దతు?
By: Tupaki Desk | 21 Feb 2017 9:07 AM GMTఏపీ రాజధాని అమరావతిలో నిర్వహించిన చేనేత సత్యాగ్రహ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాన్ చేసిన వ్యాఖ్యలు ఆయన్ను ఇరకాటంలోకి నెట్టేశాయి. సామాజిక అసమానతలు, వివక్షలపై తరచూ తన గళం విప్పే పవన్ ఈ సభలో వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకం కాదని చెప్పడం వివాదాస్పదమైంది. దేశంలో వారసత్వ రాజకీయాలు ఎంతగా వేళ్లూనుకున్నాయో.. అది ప్రజాస్వామ్యానికి ఎంతగా వెక్కిరిస్తున్నాయో తెలిసిందే.. ఇలాంటి పరిస్థితుల్లో పవన్.. తాను వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం కాదని చెప్పడం వివాదాస్పదమైంది. అంతేకాదు పవన్ వ్యాఖ్యలు పరోక్షంగా తెలుగు రాష్ట్రాల్లో లోకేశ్ - కేటీఆర్ వంటి వారసులకు మద్దతు తెలిపేవిగా ఉన్నాయంటున్నారు. అయితే.. పవన్ ఈ విషయంలో ఇలాంటి స్టాండ్ కలిగి ఉండడానికి కారణం ఉందంటున్నారు. ఆయన కూడా వారసత్వంతోనే సినీ స్టార్ డమ్ తెచ్చుకున్నాడని.. ఇప్పుడ రాజకీయాల్లో కూడా ఆయన వారసుడేనని అంటున్నారు. అందుకే తనదాకా వచ్చేసరికి పవన్ ఈ విషయంలో ఎలాంటి వ్యతిరేకత చూపడం లేదని చెబుతున్నారు.
వారసత్వ రాజకీయాలు... వారసులు నాయకులుగా రావడంపై తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని పవన్ నిన్నటి సభలో స్పష్టంగా చెప్పారు. పోరాటపటిమ-నిస్వార్థమైన నాయకుల కోసం ఎదురుచూస్తున్నానని.. రాజకీయ నాయకులు ఎవరైనా ప్రజలకు మేలు చేసే రీతిలో ముందుకు సాగాలని ఆయన అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలు చర్చనీయమయ్యాయి. ఏపీలో సీఎం చంద్రబాబు తనయుడు అంతా తానై నడిపిస్తుండడమే కాకుండా త్వరలో అమాత్యుడి అవతారం ఎత్తబోతున్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కుమారుడు బాలయ్య కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇంతకుముందు ఎన్టీఆర్ కుటుంబం నుంచి పురంధేశ్వరి కేంద్ర మంత్రిగా.. హరికృష్ణ ఎంపీగా ఉన్నారు. మరోవైపు తెలంగాణలోనూ సీఎం కేసీఆర్ కుమారుడు మంత్రిగా ఉంటూ పార్టీ, ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. కేసీఆర్ కుమార్తె కూడా ఎంపీగా ఉన్నారు. ఇలాంటి రాజకీయ పరిస్థితుల్లో పవన్ తన సహజ విధానాలకు భిన్నంగా వారసత్వానికి జై కొట్టారు.
సామాజిక న్యాయం అని నిత్యం చెప్పే పవన్.. వారసత్వ నాయకత్వాల కారణంగా ప్రజాస్వామిక న్యాయం దెబ్బతింటోందన్న లాజిక్ మాత్రం మర్చిపోయారు. పవన్ అన్న చిరంజీవి స్వయం శక్తిగా మెగా స్టార్ గా అవతరించాకే ఆయన తమ్ముడి హోదాలో పవన్ పవర్ స్టార్ గా నిలిచారు. చిరు కుటుంబం నుంచి అయిదారుగురు హీరోలు తెలుగు సినీ ఇండస్ర్రీలో రాజ్యమేలుతున్నారు. అంతేకాదు.. చిరంజీవి సినిమాల తరువాత రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టడం .. ఆ తరువాత పార్టీని మూసేసి కాంగ్రెస్ లో చేరి కేంద్ర మంత్రి కావడం తెలిసిందే. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడే పవన్ అన్న వెంట కాళ్లకు బలపం కట్టుకుని తిరిగారు. అక్కడే ఆయన రాజకీయ వారసత్వానికి పునాది పడింది. చిరంజీవి అభిమానులను వారసత్వంగా తీసుకున్న పవన్ ఇప్పుడు రాజకీయంగా చిరుతో విభేదిస్తున్నా కూడా ఆయనకు రాజకీయ వారసుడే అవుతారు. ఇన్ని కారణాలు ఉన్నాయి కాబట్టే పవన్ కు రాజకీయ వారసత్వమంటే అంత ముచ్చటగా ఉందని విమర్శకులు అంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/