Begin typing your search above and press return to search.
తప్పును ఎటకారంతో కవర్ చేసిన పవన్!
By: Tupaki Desk | 23 March 2019 7:27 AM GMTతప్పు మాట్లాడితే.. అవును.. పొరపాటు పడ్డా అంటూ నిజాన్ని ఒప్పుకొని తాను చెప్పాలనుకున్నది చెప్పే తీరు రాజకీయ నేతల్లో అస్సలు కనిపించదు. నిజాన్ని నిర్మోహమాటంగా చెప్పే కంటే కూడా.. కాసింత మసాలా మరికాస్త ఎటకారం కలిపేసి ప్రత్యర్థులపై పంచ్ లు వేయటం రాజకీయాల్లో మామూలైపోయాయి.
తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఆ కళ బాగానే అబ్బిన వైనం తాజాగా చోటు చేసుకున్న ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థం కాక మానదు. తాజాగా పవన్ ఒక సభలో మాట్లాడుతున్న వేళ.. ఆయన నోటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణంరాజును కాస్తా టీడీపీ నేతగా ప్రస్తావించారు.
పవన్ మాటకు జనం నుంచి స్పందనగా టీడీపీ కాదు.. జగన్ పార్టీ అంటూ పెద్ద ఎత్తున కరెక్షన్ వచ్చింది. ఈ ఇబ్బందికర పరిస్థితిన తెలివిగా డీల్ చేసిన పవన్.. ఓహో.. వైఎస్సార్ కాంగ్రెస్ కు వెళ్లిపోయారా? అంటూ ఎటకారం ఆడేశారు. ఇటీవల రఘుతో తాను మాట్లాడానని టీడీపీలో ఉన్నట్లు చెప్పారని.. అంతలోనే పార్టీ మారిపోయారా? అంటూ వ్యంగ్యస్త్రాన్ని సంధించారు.
నరసాపురం అభ్యర్థిగా పలువురి పెద్దల్ని అడిగానని.. పార్టీ తరపున పోటీ చేయాలంటే భయపడిపోయారని చెప్పారు పవన్. తమకు డబ్బు భయమన్న వారి మాటలతో తాను అన్నయ్య నాగబాబును ఒప్పించినట్లు చెప్పారు. మొత్తానికి నోటి వెంట మాట తేడా వచ్చినా.. ఆ వెంటనే దాన్ని సరి చేసుకునే కళ పవన్ కు వచ్చిందంటే.. ఫర్లేదుఆయనకు రాజకీయాలు బాగానే వంటపడుతున్నట్లుగా చెప్పాలి.