Begin typing your search above and press return to search.
నాపై వైసీపీ నేతలు ఢిల్లీలో ఫిర్యాదు చేశారు: పవన్ కామెంట్స్
By: Tupaki Desk | 14 Nov 2022 5:52 AM GMTఏపీలో ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టిన జనసేన అధినేత పవన్‌కళ్యాణ్.. ఇటీవల కాలంలో వైసీపీపై తీవ్రస్థాయి లో ప్రశ్నలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. కంచుకంఠంతో విరుచుకుపడుతున్నారు. చెప్పులు చూపి స్తున్నారు. తగ్గేదేలే అని వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటంలో ఆయన మరింత దూకుడు ప్రదర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం టీడీపీతో చేతులు కలుపుతున్నట్టు చెప్పారు. ఇదంతా ప్రధాని నరేంద్ర మోడీని విశాఖలో కలుసుకోక ముందు.. ఆయనతోచర్చించక ముందు!!
కానీ, ఆ తర్వాతే అనూహ్యంగా పవన్‌లో భారీ మార్పు కనిపించింది. తాజాగా విజయనగరంలో పర్యటించి.. ఇక్కడి గుంకలాంలో ప్రభుత్వం వేసిన జగనన్న లే అవుట్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్.. ఎక్కడా దూకుడు ప్రదర్శించకపోవడం.. సీఎం జగన్‌ను కార్నర్ చూస్తే.. వ్యంగ్యాస్త్రాలు సంధిచక పోవడం గమనార్హం. కేవలం తన వ్యాఖ్యలను జగనన్న కాలనీలకే పరిమితం చేశారు. అక్కడేదో అవినీతి జరుగుతోందన్నారు.
మరి ఈ మార్పు ఇలా ఉంటే.. తన ప్రసంగంలో ఒక సంచలన కామెంట్ చేశారు. ''ఢిల్లీలో వైసీపీ నాయకులు నాపై ఫిర్యాదులు చేస్తున్నారు. వారు రాష్ట్రం కోసం డిల్లీలో పర్యటించడం లేదు. కేవలం నాపై విమర్శలు చేసేందుకే ఢిల్లీ వెళ్తున్నారు'' అని పవన్ వ్యాఖ్యానించారు. అంటే.. దీనిని బట్టి ఢిల్లీలో ఏం జరుగుతోందనేది పవన్‌కు తెలిసిందనే చర్చసాగుతోంది. అది కూడా ఇటీవల ప్రధాని మోడీని కలిసిన తర్వాత ఇలా వ్యాఖ్యానించడాన్ని బట్టి.. స్వయంగా ప్రధానే పవన్‌కు క్లాస్ ఇచ్చి ఉంటారని అంటున్నారు.
పవన్‌పై వైసీపీ నేతలు చేసిన ఫిర్యాదులను ప్రధాని మోడీ ప్రస్తావించి ఉంటారని, ఆయా ఫిర్యాదులపై వివరణ కూడా తీసుకుని ఉంటారని పరిశీలకులు భావిస్తున్నారు.
అందుకే.. మోడీ భేటీ తర్వాత పవన్ గుంభనంగా వ్యవహరించడం.. తన దూకుడు తగ్గించడం.. వంటివి చేస్తున్నారని అంటున్నారు. మోడీని కలిసిన వారిలో పవన్, ఆయన పార్టీ కీలక నాయకుడు నాదెండ్ల మనోహర్ మాత్రమే ఉన్నారు. సో.. వీరు ఇద్దరూ కూడా లోపల ఏం జరిగిందనే విషయాన్ని బయటకు చెప్పలేదు.
కానీ, పవన్‌లో వచ్చిన అనూహ్య మార్పు నేపథ్యంలో మోడీ క్లాస్ తీసుకుని ఉంటారనే చర్చ మాత్రం జరుగుతోంది. అదే సమయంలో ఏపీ అధికార పార్టీపై పవన్ ప్రదర్శిస్తున్న దూకుడు కూడా ప్రధాని చర్చించి వారించి ఉంటారని అంటున్నారు. మొత్తానికి తాజాగా పవన్‌లో కనిపించిన మార్పునుచూస్తే.. ప్రధానితో భేటీలో ఏదో జరిగిందనే వాదనకు బలం చేకూరుతుండడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.