Begin typing your search above and press return to search.

ఇరవైలో యాభై : పవన్ లెక్క పక్కా

By:  Tupaki Desk   |   3 Sep 2022 2:11 AM GMT
ఇరవైలో యాభై : పవన్ లెక్క పక్కా
X
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల మీద సీరియస్ గానే దృష్టి సారించారు. ఈసారి అసెంబ్లీలో జనసేన బిగ్ సౌండ్ చేయాలి. ఏదో విధంగా కింగ్ కావాల్సిందే. దానికంటే ముందు కింగ్ మేకర్ గా దూసుకుని రావాలి. ఇదే పవన్ మార్క్ పొలిటికల్ స్ట్రాటజీ. దాని కోసం ఏం చేయాలన్నది కూడా జాగ్రత్తగా పవన్ ప్రిపేర్ చేసుకున్నారని తెలుస్తోంది. పవన్ సొంతంగా 2019 ఎన్నికల్లో జనసేనను పోటీకి దించారు.

ఆ ఎన్నికల్లో మిత్రులుగా ఉన్న వామపక్షాలకు, బీఎస్పీకి సీట్లు ఇవ్వగా 137 సీట్లలో జనసేన పోటీకి దిగింది. ఈ సీట్లలో కొన్ని చోట్ల మంచి పెర్ఫార్మెన్స్ చేసింది అని గణాంకాలు చెబుతున్నాయి. దాంతో జనసేన ఒక పారామీటర్ ని పెట్టుకుని ఆ సీట్ల మీద ప్రత్యేక దృష్టి పెడుతోంది అని అంటున్నారు. 2019 ఎన్నికల్లో ఇరవి వేల ఓట్ల దాకా వచ్చిన సీట్లు యాభై దాకా ఉన్నట్లుగా గుర్తించారుట.

ఆ సీట్లను మరింతగా బలోపేతం చేసుకోవాలని జనసేనాని గట్టి వ్యూహాన్ని రచించారు. అవి గోదావరి, కోస్తా విశాఖ జిల్లాల వంటి చోట్ల ఉన్నాయని తెలుస్తోంది. ఈ సీట్లను కనుక పటిష్టం చేసుకుంటే 2024లో కచ్చితంగా జనసేన ఖాతాలో యాభై సీట్లు ఉండి తీరుతాయని. అపుడు ప్రభుత్వ ఏర్పాటులో కీలకమైన పాత్రను అంటే కింగ్ మేకర్ గా తామే పోషించవచ్చు అన్నదే జనసేన రాజకీయ వ్యూహం అంటున్నారు.

పవన్ బస్సు యాత్రలో కూడా ఈ సీట్ల మీద ఫుల్ ఫోకస్ పెడతారు అని చెబుతున్నారు. ఈ సీట్లను ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకోవాలని, వాటిలో బలమైన అభ్యర్ధులు బరిలో ఉండేలా ఇప్పటి నుంచే చూసుకోవాలని జనసేన డిసైడ్ అయింది అంటున్నారు. ఇక పొత్తుల విషయానికి వస్తే దానికి జనసేన ఓకే చెబుతుంది అని అంటున్నారు.

అయితే ఈ సీట్లను మాత్రం ఇస్తేనే పొత్తులు ఉంటాయని ఖరాఖండీగా చెప్పబోతోంది అని అంటున్నారు. మరి తెలుగుదేశం పార్టీకి కూడా ఈ సీట్లలో పట్టు ఉన్నవి ఉన్నాయి. పైగా జనసేన ఇరవై వేలు సీట్లు కొన్ని చోట్ల టీడీపీ నలభై వేల నుంచి యాభై వేల దాకా ఓట్లు తెచ్చుకున్నవి ఉన్నాయి. దాంతో పొత్తులలో భాగంగా ఈ సీట్లలో కొన్ని టీడీపీ కూడా ఇవ్వడానికి ఇష్టపడదు అని అంటున్నారు.

పైగా బీజేపీ జనసేనలతో పొత్తులు కుదిరితే ముప్పయికి తగ్గకుండా సీట్లు ఇచ్చి కధ ముగించేయాలని టీడీపీ భావిస్తోంది అని అంటున్నారు. దాంతో జనసేన తాము కోరుకున్న నంబర్ దక్కకపోతే సొంతంగా అయినా పోటీ చేసి అనుకున్న సీట్లలో పోటీ చేయాలని కూడా వ్యూహ రచన చేస్తోంది అని అంటున్నారు.

మొత్తానికి యాభై సీట్లనే టార్గెట్ గా పెట్టుకుని జనసేన కొత్త రకం పాలిటిక్స్ కి తెర లేపుతోంది. ఈ యాభై సీట్లే 175 సీట్లున్న ఏపీ అసెంబ్లీలో రేపటి సీఎం ని డిసైడ్ చేస్తాయని కూడా గట్టిగా నమ్ముతోందిట. చూడాలి మరి ఏది జరిగేనో.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.