Begin typing your search above and press return to search.
నిన్న చిరు ఇవాళ పవన్ .. కేసీఆర్ ను వదలట్లేదుగా!
By: Tupaki Desk | 10 Nov 2020 5:10 PM GMTదుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పరాజయం పాలవడం ఖచ్చితంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నిరాశకు గురి చేసేదే అనే సంగతి తెలిసిందే. ఐపీఎల్ మ్యాచ్ తలపించేలా సాగిన దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్ ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. రౌండ్ రౌండ్ కు దోబూచులాడిన విజయం ఎట్టకేలకు దుబ్బాక బీజేపీ ఉప ఎన్నిక అభ్యర్ధి రఘునందన్ వరించగా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే, ఈ విషయంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది.
దుబ్బాకలో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునందన్ రావుకు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వానికి శుభాబినందనలు తెలుపుతున్నానని పవన్ కళ్యాణ్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. బీజేపీ - ఆ పార్టీ నాయకత్వంపై ప్రజల విశ్వాసానికి నిదర్శనం దుబ్బాకలో విజయం అని విశ్లేషించారు. ``బీజేపీ తెలంగాణ శాఖ నాయకత్వ పగ్గాలు స్వీకరించిన నాటి నుంచి నేటి దుబ్బాక ఉప ఎన్నికల వరకు బండి సంజయ్ చూపిన నాయకత్వ పటిమ నేటి విజయానికి మార్గం వేసింది. పార్టీలోని అన్ని వర్గాలను సమాయత్తం చేసి ఆయన ఈ విజయాన్ని సాధించారు. అదే విధంగా రఘునందన్ రావు వ్యక్తిత్వం, ప్రజా సేవలో చూపే నిబద్దత ఆయనకు విజయ హారాన్ని అందించింది. రాజకీయాలను సక్రమ మార్గంలో నడిపించడం యువత వల్లే సాధ్యమవుతుందని నేను విశ్వసిస్తాను. ఈ ఎన్నికలో యువకులు విశేష సంఖ్యలో పాల్గొనడం ఒక శుభపరిణామం. దుబ్బాక విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ పేరు పేరున అభినందనలు తెలుపుతున్నాను.`` అని పవన్ పేర్కొన్నారు.
బీజేపీతో పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పవన్ తమ మిత్రపక్ష అభ్యర్థి గెలుపు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, మరికొందరు దీనిపై ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి రెండు రోజుల తర్వాత ... తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ప్రకటించి మెగాస్టార్ చిరంజీవి కేసీఆర్‌కు షాకిస్తే... తన సొంత ఇలాకాలో టీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత బీజేపీ గెలుపు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పవర్ స్టార్ ప్రకటన వెలువరించడం ఇంకో షాక్ వంటిదని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.