Begin typing your search above and press return to search.
సోము వీర్రాజుపై పవన్ స్పందన.. పొత్తుపై క్లారిటీ?
By: Tupaki Desk | 28 July 2020 11:30 AM GMTఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకయ్యారు. దీంతో ఏపీ, తెలంగాణ సహా ప్రముఖ నేతలంతా ఆయనను అభినందిస్తున్నారు. దూకుడైన సోమూ వీర్రాజు ఏపీ పగ్గాలు చేపట్టడంతో ఇక బీజేపీ దూకుడుగా వెళ్తుందని బీజేపీ శ్రేణులు సంబరపడుతున్నాయి.
అయితే ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకొని ముందుకెళ్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం తాజాగా ఏపీ కొత్త బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై స్పందించారు. కొత్త మార్పును స్వాగతిస్తూ సోమూ వీర్రాజుకు శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీతో పొత్తు కొనసాగుతుందని తేల్చిచెప్పారు.
బీజేపీకి పార్టీ అధ్యక్షుడు మారినంత మాత్రాన పొత్తు విషయాన్ని పున: సమీక్షించలేమనే విషయాన్ని పవన్ కళ్యాణ్ పరోక్షంగా స్పష్టం చేశారు.సోమూ వీర్రాజుతో కలిసి పనిచేస్తామని.. ముందుకు సాగుతామని.. తమ బంధం విడిపోదని పవన్ కళ్యాణ్ కుండబద్దలు కొట్టారు.
కన్నా లక్ష్మీనారాయణ ఇన్నాళ్లు పవన్ బాటలో నడిచారు. ఇద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారు.. ఒకే ఆలోచనలతో వెళ్లారు. ఇప్పుడు కొత్త అధ్యక్షుడు దూకుడైన వ్యక్తి కావడం.. పవన్ తో కలిసి పయనిస్తాడా లేదా అన్నది వేచిచూడాలి.