Begin typing your search above and press return to search.
ఓకే ట్వీట్ తో విమర్శకులకు పవన్ కౌంటర్
By: Tupaki Desk | 6 Jan 2018 7:08 AM GMTసినీ నటుడు - జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన విమర్శకులకు ఒకే ట్వీట్ తో కౌంటర్ ఇచ్చారు. తన అభిమానులు - ప్రముఖ సినీ విమర్శకుడు - బిగ్ బాస్ కంటెస్టెంట్ కత్తి మహేశ్ మధ్య ఎడతెగని వివాదం కొనసాగుతూ ఉండటం, ఇటీవలే తనపై కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చేసిన కామెంట్లకు ట్విట్టర్ ద్వారానే కౌంటర్ ఇచ్చారు. ఇటీవల ముద్రగడ స్పందిస్తూ పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదని కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కత్తి మహేష్ పవన్ కల్యాణ్ రాజకీయ విధానాలపై విమర్శలు చేయడం.. దానికి బదులుగా పవన్ అభిమానులు కత్తిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ దుర్భాషలాడటం కొనసాగుతూనే ఉంది.
ఇలా వరుసగా సాగుతున్న పరిణామాల నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వరుసగా రెండు ట్వీట్లు చేసి క్లారిటీ ఇచ్చేశారు. శనివారం ఉదయమే వరుసగా రెండు ట్వీట్ లు చేసిన పవన్ తనపై వస్తున్న విమర్శకులకు కౌంటర్ ఇచ్చారు. కులం - మతాల వారీగా సమాజం విడిపోవడం సరికాదని పేర్కొన్నారు. అధికారమే పరమావధిగా రాజకీయం మారిందన్నారు. ఇలాంటి పరిణామాలు సమాజ ఆర్థికాభివృద్ధికి దోహదం చేయవని పేర్కొన్నారు. కులం - మతం - ధనం ఆధారిత రాజకీయాలు సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయని పవన్ విశ్లేషించారు.
దీంతోపాటు మరో ట్వీట్ కూడా జనసేనాని చేశారు. `వ్యక్తిత్వంలో నిన్ను ఓడించడం చేతకాని వాళ్లు..నీ కులం - ధనం - వర్ణం గురించి మాట్లాడతారు. (ఎవరు చెప్పారో తెలియదు కానీ ఓ సీనియర్ జర్నలిస్టు ఉదయాన్నే నాకు పంపించారు. బాగుందని షేర్ చేస్తున్నా’ అని పవన్ పేర్కొన్నారు. పరోక్షంగా కత్తి మహేశ్ ను ఉద్దేశించి పవన్ కల్యాణ్ ఈ ట్వీట్ చేసినట్టు భావిస్తున్నారు. దీనిని సోషల్ మీడియాలో రీట్వీట్ చేసిన పలువురు నెటిజన్లు సైతం ఇది కత్తి మహేశ్ కు పవన్ ఇచ్చిన కౌంటర్ అని అంచనావేస్తున్నారు.