Begin typing your search above and press return to search.
చెలరేగిపోయిన పోసానికి ట్వీట్ తో స్ట్రాంగ్ కౌంటర్ వేసిన పవన్
By: Tupaki Desk | 28 Sep 2021 3:44 AM GMT‘రిపబ్లిక్’ మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్ లో ఏపీలోని వైసీపీ నేతలపై ఒక రేంజ్ లో విరుచుకుపడటం.. మంత్రిని సన్నాసి అంటూ దారుణంగా విమర్శించిన పవన్ కల్యాణ్ మాటలు అటు రాజకీయంగానూ.. ఇటు సినిమా రంగంలోనూ ఎన్ని ప్రకంపనల్ని క్రియేట్ చేశాయో తెలిసిందే. పవన్ కు కౌంటర్ ఇచ్చేందుకు సీనియర్.. జూనియర్ అన్న తేడా లేకుండా ఐదుగురు మంత్రులు స్వయంగా రంగంలోకి దిగటం.. పవన్ పై ఘాటు కౌంటర్లు ఇవ్వటం తెలిసిందే. ఇక.. ‘సన్నాసి’ అంటూ పవన్ చేత మాట అనిపించుకున్న మంత్రి పేర్ని నాని అయితే.. ఆవెశంతో ఎంతలా చెలరేగిపోయారో మీడియా మీట్ ను చూస్తే అర్థమవుతుంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. వైసీపీకి సానుభూతిపరుడిగా.. జగన్ కు విధేయుడిగా వ్యవహరించే నటుడు పోసాని కృష్ణ మురళి తాజాగా రియాక్టు అయ్యారు.పవన్ మాట్లాడిన భాష సరిగా లేదన్న మాటతో పాటు.. ఆయనపై దారుణ రీతిలో విమర్శలు గుప్పించారు. చిరంజీవి నోటి ను ంచి అమర్యాద పదాలు ఎప్పుడైనా వచ్చాయా? అని ప్రశ్నిస్తూ.. పవన్ కల్యాణ్ ఏంటో సినీ పరిశ్రమకు.. ప్రపంచానికి బాగా తెలుసన్న ఆయన.. జగన్ తో మీకు పోలికే లేదన్నారు.
అవకాశాల పేరుతో పంజాబ్ అమ్మాయిని ఒక వ్యక్తి మోసం చేశాడని.. విషయం బయటపడితే చంపేస్తామని బెదిరించినట్లుగా తెలిసిందని.. ఆ విషయం తానే స్వయంగా విన్నట్లు చెప్పారు.
సదరు అమ్మాయికి న్యాయం చేస్తే పవన్ కు గుడి కడతానని.. తాను సొంతంగా స్తోత్ర నామాలు రాస్తానంటూ చెలరేగిపోయారు. రిపబ్లిక్ మూవీ కార్యక్రమంలో తాను మాట్లాడిన తర్వాత పెద్ద ఎత్తున విమర్శలకు దిగిన ఏపీ మంత్రులకు కౌంటర్ ఇస్తూ.. పవన్ కల్యాణ్ ఒక ట్వీట్ పోస్టు చేయటం.. అందులో ఏపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమిటి? వాస్తవంగా వాటి అమలు ఎలా ఉందన్న విషయాన్ని తెలియజేసేలా ఒక పోస్టు పెట్టి.. అందులో వైసీపీ ప్రభుత్వ తీరును తప్పు పట్టారు. పాలనలో ఎంతలా ఫెయిల్ అయ్యారన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు.
ఈ రెండింటికి కౌంటర్ గా అన్నట్లుగా రంగంలోకి దిగిన పోసాని వ్యాఖ్యలు పెను దుమారంగా మారాయి. దీనికి మరెవరో కాకుండా.. తనకు తాను కౌంటర్ ఇవ్వాలని పవన్ డిసైడ్ అయినట్లుగా అనిపిస్తోంది. పోసాని వ్యాఖ్యలకు కౌంటర్ అన్నట్లు తాజాగా ట్వీట్ కౌంటర్ ఇచ్చిన పవన్.. ‘‘తుమ్మెదల ఝుంకారాలు.. నెమళ్ల క్రేంకారాలు.. ఏనుగుల ఘీంకారాలు.. వైసీపీ గ్రామసింహాల గోంకారాలు సహజమే’ అంటూ సింఫుల్ ట్వీట్ తో తేల్చేశారు. ఈ సంచలన ట్వీట్ తో.. తాను తగ్గేదే లేదన్న విషయాన్ని పవన్ స్పష్టం చేశారని చెప్పాలి. మొత్తానికి రానున్న రోజుల్లో ఈ ఎపిసోడ్ మరింత ముదరటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.