Begin typing your search above and press return to search.
పవన్.. దాసరి... చిరంజీవి.. సేమ్ ఫార్ములా
By: Tupaki Desk | 15 Jan 2016 5:29 AM GMTఏపీలో మారుతున్న రాజకీయ పరిస్థితుల కారణంగా కాపు వర్గాన్ని చేరదీయడానికి అన్ని పార్టీలూ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అన్ని పార్టీలూ తమకు బలమైన కాపు ప్రతినిధి ఒకరు ఉండాలని భావిస్తున్నాయి. టీడీపీ-బీజేపీలు ఇప్పటికే పవన్ కళ్యాణ్ రూపంలో అలాంటి బలమైన కాపు ప్రతినిధి అండ సంపాదించి మొన్నటి ఎన్నికల్లోనే లబ్ధి పొందాయి. అది చూసే వైసీపీ, కాంగ్రెస్ కూడా వచ్చే ఎన్నికల నాటికైనా కాపు కార్డుతో లబ్ధి పొందాలని ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అయితే.... అందరూ కూడా సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన కాపు నేతలనే ఎంచుకుంటూ కాపు నేతలంటే సినిమావాళ్లే అన్నట్లుగా చేస్తున్నారు. బహుశా టీడీపీ-బీజేపీకి పవన్ అండడం ఉండడంతో తాము కూడా సినీరంగం వారినే సెలక్ట్ చేసుకోవాలని మిగిలిన పార్టీలు భావిస్తున్నట్లున్నాయి.
మొన్నటికి మొన్న వైసీపీ అధినేత జగన్ వెళ్లి కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావును కలిసి తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. కాపుల్లో మంచి పేరున్న దాసరి కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు... సినీ దర్శక, నిర్మాతగా, నటుడిగా ఒకప్పుడు ఇండస్ర్టీలో కీలక పాత్ర పోషించారు. అందుకే జగన్ ఆయనపై కన్నేశారు. అయితే.. దాసరికి మునుపటి పాపులారిటీ లేదన్నది ఇంకో విషయం.
తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా కాపుల కోసం కొత్త ఎత్తుగడ వేసింది. కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ నటుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవిని ఏకంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోకి తీసుకోవాలని దాదాపుగా నిర్ణయం తీసుకుంది. నిజానికి చిరుకు కొన్నాళ్లుగా పార్టీకి దూరంగాఉంటున్నారు. పార్టీ కష్టాల్లో ఉండడంతో ఆయన బరువు బాధ్యతలు మోసేందుకు ఇష్టపడక తప్పించుకు తిరుగుతున్నారు. అలాంటి నేతను కాంగ్రెస్ పార్టీ కీలక స్థానంలో కూర్చోబెట్టడానికి సిద్ధమవడం వెనుకా ఇదే ఫార్ములా కనిపిస్తోంది. మొత్తానికి ప్రధాన పార్టీలన్నీ కూడా కాపు సినీ ప్రముఖుల వెనుక పడుతున్నాయి. ఇంకేముంది మిగతా కాపు సినీ ప్రముఖులు కూడా మిగిలిన చిన్నచితకా పార్టీలను సంప్రదిస్తే పెద్ద పెద్ద పదవులు దొరికేయడం ఖాయం.