Begin typing your search above and press return to search.
మోడీతో భేటీ ఉండదా...పవన్ ఢిల్లీ టూర్ లో ఎన్నో ట్విస్టులు
By: Tupaki Desk | 4 April 2023 6:00 PM GMTప్రధానమంత్రి నరేంద్ర మోడీ. బీజేపీకి ఆయనే కీలకం. అలాగే కేంద్రంలో ఆయన అన్నింటా ఉన్నారు అలాంటి మోడీని ఢిల్లీలో నరేంద్ర మోడీ ఎపుడూ కలవలేదు. ఆ మాటకు వస్తే పవన్ మోడీల భేటీకి ఢిల్లీ వేదిక అచ్చిరాలేదా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి.
ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే 2014 ఎన్నికల ముందు బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా మోడీ పేరు డిక్లేర్ కాగానే టాలీవుడ్ నుంచి ఫస్ట్ మద్దతు ఇచ్చింది పవన్ కళ్యాణ్. ఆయన నేరుగా గుజరాత్ వెళ్లి ఆనాటికి గుజరాత్ సీఎంగా ఉన్న మోడీని స్వయంగా కలసి వచ్చారు. అలా ఇద్దరి మధ్యన అక్కడ తొలి భేటీ జరిగింది.
ఇక బీజేపీ కేంద్రంలో 2014లో అధికారంలోకి రాగానే మోడీ ప్రమాణ స్వీకారానికి పవన్ కి ఆహ్వానం వచ్చింది కానీ పవన్ వెళ్లలేదు. ఆ తరువాత మూడేళ్లకు ప్రత్యేక హోదా విహయంలో బీజేపీతో విభేదించి పవన్ బయటకు వచ్చారు. తిరిగి బీజేపీతో 2020లో పొత్తు పెట్టుకున్నారు. అది జరిగిన మూడేళ్ల తరువాత 2022 లో విశాఖలో ప్రధాని నరేంద్ర మోడీతో పవన్ భేటీ అయ్యారు. అంటే దాదాపుగా తొమ్మిదేళ్ల తరువాత జరిగిన భేటీగా దీన్ని చెప్పుకున్నారు.
ఈ మధ్యన అంటే 2020 నుంచి పవన్ ఎన్ని సార్లు ఢిల్లీ వెళ్ళినా బీజేపీ పెద్దల అపాయింట్మెంట్లు అయితే లభించలేదు అనే చెప్పాలి. ఆ మధ్యలో ఒకసారి బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను కలసి వచ్చేశారు. ఇవన్నీ ఇలా ఉంటే చాలా కాలానికి మళ్లీ పవన్ ఢిల్లీ వెళ్లారు. ప్రస్తుతం పవన్ ఢిల్లీలో మూడవ రోజు విడిది చేసి ఉన్నారు.
ఆయన ఇప్పటికి ఇద్దరు కేంద్ర మంత్రులు మురళీధరన్, గజేంద్రసింగ్ షెకావత్ లని కలిశారు ఇందులో మురళీధరన్ ఏపీ బీజేపీ ఇంచార్జి కూడా. ఆయనతో రెండు విడతలుగా భేటీ అయి ఏపీలోని రాజకీయ పరిణామాలను పూసగుచ్చినట్లుగా పవన్ చెప్పారు. ఇక పవన్ జేపీ నడ్డాతో పాటు అమిత్ షాలను కలిసి తన ఢిల్లీ టూర్ ని ముంగించనున్నారు. ఆయన వెంట జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు.
విషయం ఏంటి అంటే ఈసారి టూర్ లో పవన్ ప్రధాని మోడీని కలుస్తారు అని ప్రచారం జరిగినా అది జరిగే అవకాశాలు లేవు అని అంటున్నారు. ప్రధాని మోడీ అపాయింట్మెంట్ పవన్ కి లభించలేదా అన్నదే చర్చగా ఉంది. విశాఖలో గంట పాటు వన్ టూ వన్ గా పవన్ మోడీ కలసి మాట్లాడుకున్నారు. ఇపుడు పవన్ ఢిల్లీ వచ్చారు. మరి ప్రధానితో ఎందుకు భేటీ లేదు అన్నదే అందరిలోనూ మెదలుతున్న ప్రశ్న.
అయితే అమిత్ షా జేపీ నడ్డాలతో మాట్లాడితే చాలు ప్రధానితో మాట్లాడినట్లే అంటున్నారు. ఇదిలా ఉండగా ఏపీలో బీజేపీ జనసేనల మధ్య పొత్తులు సరిగ్గా లేవు. ఏపీ బీజేపీ నేతలు తమకు గౌరవం ఇవ్వడం లేదన్న బాధ జనసేనలో ఉంది. అలాగే కేంద్ర పెద్దలు కూడా ఇప్పటిదాకా జనసేనను పెద్దగా పట్టించుకోలేదని అంటున్నారు ఇపుడు వారే పవన్ని పిలిచారని అంటున్నారు.
కర్నాటకలో ఎన్నికలు ఉన్న నేపధ్యంలో పవన్ సేవలను పూర్తిగా వినియోగించుకుని ప్రచారం చేయించుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు. పవన్ సైతం తన డిమాండ్లను బీజేపీ పెద్దల వద్ద ఉంచుతారు అంటున్నారు. ఏపీలో టీడీపీతో పొత్తులు పెట్టుకోవాలన్నదే పవన్ డిమాండ్. మూడు పార్టీలు కలిస్తే సులువుగా వైసీపీని ఓడించవచ్చు అన్నది పవన్ ఆలోచన. మరి దీనికి కేంద్ర పెద్దలు ఏమంటారో చూడాల్సి ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.