Begin typing your search above and press return to search.
పవన్ చెప్పారు.. పెద్దాయన విన్నారు.. జగన్‌కు దబిడిదిబిడేనా?!
By: Tupaki Desk | 2 Jan 2023 3:30 PM GMTకాపులకు రిజర్వేషన్ కల్పించాలనే ప్రధాన డిమాండ్‌తో 82 ఏళ్ల వయసులో ఆమరణ నిరాహారత దీక్షకు దిగిన కాపు నాయకుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామయ్య జోగయ్య వ్యవహారం.. రెండుతెలుగు రాష్ట్రాల్లోనూ టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. 82 ఏళ్ల వయసులో ఆయన దీక్షకు దిగడం.. అందరినీ విస్మయానికి ఉత్కంఠకు కూడా గురి చేసింది. ఈ క్రమంలో అలెర్టయిన పోలీసులు ఆయనను వెంటనే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే.
అయితే.. అక్కడ కూడా ఆయన దీక్ష చేశారు. అయితే.. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని.. దీక్ష విరమించాలని.. వైద్యులు సూచించారు అయినా.. జోగయ్య వినలేదు. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. దీక్ష విరమించాలని జోగయ్యకు విన్నవించారు. దీంతో పవన్ సూచన మేరకు పెద్దాయన దీక్ష విరమిస్తున్నానని ప్రకటించారు.
దీనికి ముందు జోగయ్యతో ఫోన్‌లో మాట్లాడిన పవన్.. ``ఇది మూర్ఖపు, మొండి ప్రభుత్వం… కాపులకు రిజర్వేషన్లను వేరే విధంగా సాధించుకుందామని జోగయ్యకు చెప్పాన. జోగయ్య లాంటి వ్యక్తుల సలహాలు.. అనుభవం అవసరం`` అని అన్నారు. ఈ క్రమంలో దీక్ష విరమించాలని జోగయ్యకు పవన్ విజ్ఞప్తి చేశారు. అన్ని రకాలుగా ఆలోచించి కార్యాచరణ రూపొందిద్దామని జోగయ్యకు పవన్ సూచించారు. మందులు కూడా వేసుకోకుండా నిరాహార దీక్షకు దిగడం బాధ కలిగిస్తోందన్నారు.
ఒక్కసారిగా ఇంతటి సాహసం చేస్తే ఎలా అంటూ జోగయ్యకు పవన్ బుజ్జగించినట్టు తెలిసింది. ఇదిలావుంటే, జోగయ్య ఆసుపత్రి బెడ్‌పై నుంచే మాట్లాడుతూ.. ``పవన్ సీఎం కావాలి.. పవన్ ద్వారా రాష్ట్ర ప్రజలు బాగుండాలన్నదే తన కోరిక`` అని అన్నారు. పవన్ వచ్చి తనను కలుస్తానని హామీ ఇచ్చినట్టు జోగయ్య చెప్పారు. జోగయ్య మార్గ దర్శకత్వం వహించాలని కూడా పవన్ చెప్పినట్టు తెలిపారు. సీఎం జగన్ దిగి రావాలన్నదే తన ఆ ఆలోచనన్న జోగయ్య… పవన్ సూచనకు సానుకూలంగా దీక్ష విరమించినట్టు తెలిపారు. ఈ పరిణామాలతో రాబోయే రోజుల్లో వైసీపీకి కాపుల వేడి మరింత తగులుతుందని అంటున్నారు పరిశీలకులు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.