Begin typing your search above and press return to search.
పవన్ కళ్యాణ్...ఆ ఛానెల్‌కు కోటి రూపాయలు ఇచ్చాడా?
By: Tupaki Desk | 15 Feb 2021 4:30 PM GMTరాజకీయాలంటే... ఏదో పార్టీ పెట్టాం.. పోటీ చేశాం..అంటే కాదు కదా..! ప్రజలలోకి వెళ్లాలి. పాపులారిటీ పెంచుకోవాలి. తాము చెబుతున్నదానిని ప్రజలు వినేలా చేయాలి.. ప్రజలకు తమకు మధ్య గ్యాప్ లేకుండా, రాకుండా కూడా చూసుకోవాలి. పార్టీ ఏదైనా.. నాయకులు ఎవరైనా.. ఎంతటి వారైనా ప్రజలతో సంబంధం లేకపోతే.. వారి వాయిస్ ప్రజలలోకి వెళ్లకపోతే.. ఇబ్బందులు తప్పవు. గతంలో లోక్ సత్తా వంటి పార్టీలు.. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఇది ఒక పార్టీ అనే విషయం కూడా పెద్దగా ప్రజల్లోకి వెళ్లలేదు. దీనికి కారణం.. ప్రమోట్ చేసే వింగ్ లేక పోవడమే!
ఇక, ఇప్పుడు ఇలాంటి సమస్యమే.. రాష్రంలో జనసేన ఎదుర్కొంటోంది. ప్రధానంగా అధికార వైసీపీకి.. సొంత మీడియా ఉంది. ప్రతిపక్షం టీడీపీకి మద్దతుగా నిలిచే చానెళ్లు.. పత్రికలు ఉన్నాయి. మరి పవర్ స్టార్ పవన్ నేతృత్వంలోని జనసేన పరిస్థితి ఏంటి? అంటే.. ఈ పార్టీ అనాథ ఏమీ కాదు.. దీనికి కూడా సొంతగా ఓ టీవీ చానెల్ ఉంది. అయితే.. ఆ చానెల్ అంతగా పాపులర్ కాకపోవడమే పెద్ద మైనస్. దీంతో జనసేనాని పవన్ తీసుకునే చర్యలు, ఆయన స్టేట్ మెంట్లు.. ప్రజలకు సరైన సమయంలో చేరడం లేదు. అదేవిధంగా ఆశించిన విధంగా వైరల్ కూడా కావడం లేదు.. అనే ఆరోపణలు ఉన్నాయి.
సరిగ్గా ఈ సమయంలోనే ప్రవాస భారతీయులకు చెందిన(ఎన్నారైలు) ఒక శాటిలైట్ చానెల్ ఈ మధ్య.. జనసేనను ప్రమోట్ చేస్తోందని తెలిసింది. అందులో పనిచేసే ఒక యాంకర్ అధికార వైసీపీకి అనుకూ లంగా పనిచేస్తున్నట్టు తెలుసుకుని.. ఆయన ప్రభావాన్ని తగ్గించి.. కమర్షియల్ యాంగిల్‌లో ఆలోచన చేశారట. ఇంత వరకు బాగానే ఉన్నా.. చానెల్ రన్ చేయాలంటే.. భారీ ఎత్తున సొమ్ములు అవసరం. ఈ నేపథ్యంలో జనసేనను ప్రమోట్ చేసిన తర్వాత.. వాళ్లను సొమ్ముల విషయంపై అడగ వచ్చని నిర్ణయించుకున్నారట.
ఈ నేపథ్యంలోనే ఇటీవల.. పవన్‌ను కలిసి.. విషయాన్ని వివరించాట. ``సార్ మీకు ప్రమోట్ చేసే బాద్యత మాది`` అని గట్టిగా హామీ కూడా ఇచ్చారట. దీంతో పవన్ వారిని అభినందించి.. కోటి రూపాయల ఎమౌంట్ ఇచ్చారని.. జనసేనవర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండడం గమనార్హం. సరే.. ఇంత వరకు బాగానే ఉన్నా.. మరి ఇప్పటికైనా.. పవన్‌కు ఆయన పార్టీకి ఆశించిన ప్రచారం లభిస్తుందా? లేదా? అనేది చూడాలి.