Begin typing your search above and press return to search.
పవన్ కోసం కదిలిన వీరభక్తుడు
By: Tupaki Desk | 29 Sep 2021 5:29 AM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ఆయన వీరభక్తుడు కదిలాడు.. తెలుగు సినిమా ఇండస్ట్రీ సమస్యలపై నిలదీసిన పవన్ పై వైసీపీ మంత్రులు, వారి మద్దతుదారులు చేస్తున్న హంగామాను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. పవన్ కళ్యాణ్ కు అండగా నిలవాలని నటుడు నిర్మాత బండ్లగణేష్ డిసైడ్ అయ్యారు.
ఈ క్రమంలోనే సినీ నిర్మాత బండ్ల గణేష్ తాజాగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. పవన్ కోసం పోరాడిన వారిని విడిపించేందుకు రంగంలోకి దిగినట్లు సమాచారం.
పోసాని నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వచ్చి ఎంత రచ్చ చేశాడో చూశాం. పోసాని వ్యాఖ్యలను నినరసనగా జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రెస్ క్లబ్ కు వచ్చి ముట్టడించారు. పోసానిపై దాడికి యత్నించారు. ఆందోళన నిర్వహించారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు.
అయితే అరెస్ట్ అయిన జనసైనికులను విడిపించేందుకు నిర్మాత బండ్ల గణేష్ అక్కడికి వెళ్లినట్లు సమాచారం. ఆయనతోపాటు పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే అక్కడ కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పవన్ కళ్యాణ్ కోసం పోరాడిన జనసైనికులను విడిపించే బాధ్యతను బండ్ల గణేష్ నెత్తిన ఎత్తుకున్నట్టు తెలిసింది. ఈ మేరకు లాయర్లతో మాట్లాడి వారికి బెయిల్ లేదా.. పోలీసులతో మాట్లాడి స్టేషన్ బెయిల్ పై విడిపించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది.