Begin typing your search above and press return to search.
హవ్వా..కాంగ్రెసోళ్లను పీకే వెంటబడి కొట్టారట!
By: Tupaki Desk | 6 July 2018 2:30 PM GMTటాలీవుడ్ లో పవర్ స్టార్ గా ఎదిగిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... రియల్ లైఫ్ కూడా రీల్ లైఫ్ గానే ఉంటుందని భ్రమపడుతున్నట్టుగా అనిపిస్తోంది. అనిపిస్తోంది ఏంటండీ బాబూ... ఏకంగా రీల్ లో కనిపించే సన్నివేశాలనే పవన్ కల్యాణ్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్లుగా చూపిస్తుంటేనూ. నిజమే... పవన్ కల్యాణ్ ఇప్పుడు ఫక్తు రాజకీయ నాయకుడిలా మారినా... ఆయనలోని నటుడు మాత్రం ఇంకా కనుమరుగు కాలేదనే చెప్పాలి. ఎంతైనా సినిమాల నుంచి పెద్దోడిగా ఎదిగిన పవన్ సినిమాలను ఎలా మరిచిపోతారులెండి. నిజమే... సినిమాలతోనే ఈ స్థాయికి ఎదిగిన పవన్ సినిమా ఇండస్ట్రీ గురించి మరిచిపోతే... అంతా దుమ్మెత్తిపోస్తారు కదా. అయినా ఎంత సినిమా మనిషి అయినా కూడా మరీ తన రీల్ లైఫ్ లో షూట్ చేసిన సన్నివేశాలను తలపించేలా తాను రియల్ లైఫ్ లోనూ హీరోగా... తనపైకి దూసుకువచ్చిన ఓ సమూహాన్ని తరిమితరిమి కొట్టానని పవన్ చెబితే నమ్మడానికి మనమేమీ వెర్రోళ్లం కాదు కదా. అయినా అసలు విషయం చెప్పకుండా ఈ రీల్ లైఫ్ - రియల్ లైఫ్ ఇన్సిడెంట్లు ఏమిటంటారా? అయితే అసలు విషయంలోకి వెళ్లిపోదాం.
పవన్ సోదరుడు - మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన నాడు... అన్న వెంటే నడిచిన పవన్... ఆ పార్టీ యువజన విభాగం బాధ్యతలను భుజానికెత్తుకున్న విషయం తెలిసిందే కదా. ఆ సమయంలో నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై నిప్పులు చెరగడమే కాకుండా... అధికార పార్టీకి చెందిన నేతల పంచెలూడదీసి కొడతామంటూ పవన్ చాలా ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన జరిగిందని - నాడు తాను - తన అభిమానులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నేతలను తరిమితరిమి కొట్టామని పవన్ తాజాగా చెప్పిన వైనం ఇప్పుడు కామెడీలకే కామెడీగా అయిపోయిందన్న వాదన వినిపిస్తోంది. అయినా నాటి ఘటనను తాజాగా వివరించిన పవన్ చెప్పిన విషయం ఏమిటంటే... పవన్ చేసిన వ్యాఖ్యలపై నాడు సీఎంగా ఉన్న దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎలా పరిగణిస్తారోనన్న భయంతో ఆ మరునాడు ప్రజారాజ్యం పార్టీ కార్యాలయానికి ఆ పార్టీకి చెందిన ఒక్క పెద్ద నేత కూడా రాలేదట. అయితే రీల్ లైఫ్ లో హీరోగా విలన్ బ్యాచ్ ను చిత్తు చిత్తుగా కొట్టేసే పాత్రల్లో బాగానే నటించిన పవన్ మాత్రం ఏమాత్రం భయం లేకుండా పార్టీ కార్యాలయానికి వచ్చారట. అంతేకాకుండా కార్యాలయంలో నేతలెవరూ కనిపించడం లేదేమిటని అడిగితే... మరికాసేపట్లో రాజశేఖరరెడ్డి మనుషులు దాడికి వస్తున్నారన్న విషయం తెలిసి నేతలంతా జారుకున్నరన్న సమాధానం వచ్చింది.
ఆ విషయం విన్న వెంటనే ఎవరొస్తారో చూస్తానంటూ... పవన్ కార్యాలయం నడిమధ్యలో కుర్చీ వేసుకుని కాలు మీద కాలేసుకుని వైఎస్ మనుషుల కోసం ఎదురు చూశారట. ఈలోగా విషయం తెలుసుకున్న పవన్ ఫ్యాన్స్ 2 వేల మంది దాకా అక్కడికి చేరుకున్నారట. ఆ తర్వాత వైఎస్ మనుషులు దాడికి వస్తే... వారిని వీధుల వెంట తరిమి తరిమి కొట్టామని పవన్ చెప్పారు. నాడు అధికారంలో ఉన్న వైఎస్ మనుషులకు తాను భయపడకపోగా... తనపై దాడికి వచ్చిన వైఎస్ మనుషులనే తరిమితరిమి కొట్టానని చెప్పిన పవన్... ఇప్పుడు కూడా అధికార పార్టీకి ఏ ఒక్కరూ భయపడాల్సిన అవసరం లేదని కార్యకర్తలకు పిలుపునిచ్చాడట. పవన్ చెప్పిన నాటి రీల్ కథగా చెప్పిన రియల్ సీన్ జరిగే ఉంటుందనుకున్నా... నాడు వైఎస్ అంటే మండిపోయేలా వ్యవహరించిన ఎల్లో మీడియా - ఎప్పుడెప్పుడు రాజశేఖరరెడ్డి దొరుకుతారా? అని ఎదురు చూస్తోంది కదా. మరి వైఎస్ బ్యాచ్ ప్రజారాజ్యం పార్టీ కార్యాలయంపై దాడికి వెళితే చూస్తూ కూర్చుందా? లేదంటే... రీల్ లైఫ్ లో మాదిరే ఓ 2 వేల మందినేసుకుని పవన్ కాంగ్రెసోళ్లను తరిమితరిమి కొడుతుంటూ మిగతా మీడియా గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయిందా? తన రియల్ లైఫ్ లో జరిగినట్టుగా ఓ రీల్ కథను చెప్పిన పవన్... ఈ ప్రశ్నలకు కూడా సమాధానం చెబితే బాగుంటుందేమో.