Begin typing your search above and press return to search.

ప‌వ‌న్... మీరు ఏమి చేశారు...

By:  Tupaki Desk   |   21 July 2018 7:51 AM GMT
ప‌వ‌న్... మీరు ఏమి చేశారు...
X

పవర్ స్టార్‌ గా ప్రజలకు పరిచయమై - తర్వాత జనసేన నేతగా ఎదిగిన పవన్ నీవుఎక్కడా..? అని సగటు ఆంధ్రుడు ప్రశ్నిస్తున్నాడు. ఎవరైనా మోదీపై అవిశ్వాస తీర్మానం పెడితే దేశమంతా తిరిగి 50 మంది ఎంపీలను పోగు చేస్తానని గతంలో చెప్పిన పవన్ - తీరా సమయం వచ్చేసరికి పత్తా లేకుండ పోయారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత టిడిపికి మద్దతు ప్రకటించిన పవన్ కల్యాణ్ - శుక్రవారం లోక్‌ సభలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు దానికి పవన్ కల్యాన్ కనీసం బయటనుంచి కూడా మద్దతు పలుకుతునట్లు ఎక్కడా ప్రకటించలేదు. అంతా ముగిసిన త‌ర్వాత‌ తీరిగ్గ ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు.

పవన్ జనసేన పార్టీ పెట్టిన తర్వాత రాజకీయంగా ఆయన ప్రజలకు దగ్గరయ్యేందుకు ఆయన ఏమి చేసారు. ఆయన ఎజండా ఏమిటీ అన్నది - జనసేన పార్టీ నాయకులకే లేదు. వచ్చే ఎన్నికలలో ఆయన పోటి చేస్తారా లేదా అన్నది కూడా ఎవరికీ క్లారిటీ లేదు. సినీ హీరోగా ఆయనకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న మాట మాత్రం వాస్తవమే అయినా - ఆయన పార్టీ మాత్రం ఆటలో అరిటిపండులా మిగిలిపోయారు.

ఏదైన సమస్య వస్తే ఆయన ట్విట్టర్‌ - ఇన్ స్టాగ్రామ్ ద్వారా స్పందించే ఆయన - ఓ సగటు ఓటరుకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించటం లేదు. ఆయన తెలుగు రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయన్ని సూటిగా ప్రశ్నించడానికి భయపడుతున్నారా. తెలుగు రాష్ట్రాలలో ఎంతమందికి ట్విట్టర్‌ - ఇన్ స్టాగ్రామ్‌ లలో ఖాతాలున్నాయి.. ఎంత మంది ప్రజలు వాటిని ఫాలో అవుతున్నారు అన్న ధ్యాస‌ పవన్ కల్యాణ్ కు లేదన్నది స్పష్టమవుతోంది. పవన్ ట్విట్టర్‌ - ఇన్ స్టాగ్రామ్‌ ల ద్వారా ఆయన ఫ్యాన్స్ చేసే లైకులకు - పోస్టులకు ఆనందపడి - అవే రాబోయే ఎన్నికలలో ఓట్లు అని అనుకుంటున్నారేమో. ఆయన సభలకు వచ్చే జనాలలో 30 సంవత్సరాలు లోపువారే కాని ఓటరు కాదు అన్నది పవన్ కల్యాణ్ తెలుసుకుంటే మంచిది. గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి తమ సభకు వచ్చిన వారిని ఓటర్లు గా మార్చుకోలేకపోయిన తన అన్న చిరంజీవి అనుభవాల నుంచి పవన్ కల్యాన్ ఏమి నేర్చుకోలేదని స్పష్టమవుతోంది.. ఇది పవన్ రాజకీయ పరిణితికి చిహ్నం.