Begin typing your search above and press return to search.
ఆ ముగ్గురూ నన్ను చంపాలనుకున్నారు!!!
By: Tupaki Desk | 27 Sep 2018 5:34 PM GMTజనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో ఢీ అంటే ఢీ అన్నట్లుగా సాగుతున్న విమర్శల దాడిలో మరో కొత్త అంశం తెరమీదకు తెచ్చారు. పశ్చిమగోదావరి జిల్లాలో పవన్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఏకంగా తనను హత్య చేయాలనుకుంటున్నారని ప్రకటించారు. ఈ స్కెచ్ వేసింది ఎవరో తెలుసునని పేర్కొంటూ మరింత హీట్ పెంచారు. దీంతో పవన్ ను చంపాలనుకున్నది ఎవరనే చర్చ హాట్ టాపిక్ గా మారింది.
ఏలూరు పాతబస్టాండ్ సెంటర్ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. ముగ్గురు వ్యక్తులు తనను హత్య చేయాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. తనను హత్య చేసేందుకు ప్లాన్ కూడా రెడీ చేశారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లోగా తనను చంపిస్తే అడ్డు తొలగుతుందనుకుంటున్నారని పవన్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి తన వద్ద కచ్చితమైన సమాచారం ఉందన్న పవన్.. తనను హత్య చేసేందుకు ఎవరు ప్రయత్నిస్తున్నారో కూడా తనకు తెలుసనడం గమనార్హం. `నాది చిన్న జీవితం. రాజకీయాలు తెలియదు. వేల కోట్ల డబ్బు లేదు. నాకు తెలిసిందల్లా సాటి మనిషి కష్టాల్లో ఉంటే ఆదుకోవడం ఒక్కటే..' అని పవన్ కల్యాణ్ అన్నారు. తనకు లోకేష్ లా హెరిటేజ్ కంపెనీ లేదని అన్నారు. 'పవన్ కల్యాణ్ సీఎం.. పవన్ కల్యాణ్ సీఎం' అని అభిమానులు నినాదాలు చేయడంతో ఆయన స్పందించారు. 'అసలు నేను ముఖ్యమంత్రే అవుతానని ఎందుకనుకుంటున్నారు? అంత కంటే ఎక్కువే అవుతానేమో? అని పవన్ వ్యాఖ్యానించడం గమనార్హం.