Begin typing your search above and press return to search.
పెళ్లి శుభలేఖ మీద పవన్ బొమ్మేసుకున్నాడు
By: Tupaki Desk | 11 Oct 2019 6:11 AM GMTఅభిమానులందు.. పవన్ కల్యాణ్ అభిమానుల వేరయా.. అన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. తమ అభిమాన నటుడి కోసం దేనికైనా సిద్ధమన్నట్లుగా పవన్ ఫ్యాన్స్ తీరు ఉంటుంది. వీరి అభిమానం కొన్నిసార్లు పవన్ కు ఇబ్బందిగా మారటం తెలిసిందే. తాజాగా చెప్పుకునే వీరాభిమాని ఇందుకు భిన్నం. పవన్ ను తానెంతగా అభిమానిస్తానన్న విషయాన్ని తన పెళ్లిశుభలేఖతో చెప్పేశారు.
చూసేందుకు జనసేన పార్టీ ఇన్విటేషన్ కార్డు తరహాలో బ్యాక్ గ్రౌండ్ ను సెట్ చేయటంతో పాటు.. పవన్ ఫోటో.. జనసేన లోగోతో తయారైన ఈ పెళ్లిశుభలేఖ ఇప్పుడు వైరల్ గా మారింది. సాధారణంగా పెళ్లిశుభలేఖ మీద తాము ఆరాధించే దేవుడి బొమ్మను వేసుకోవటం రివాజు.
కానీ.. విశాఖ జిల్లాకు చెందిన రాజేష్ రెడ్డి మాత్రం ఇందుకు భిన్నం. తాను ఎంతగానో అభిమానించే పవన్ కల్యాణ్ ఫోటోను.. ఆయన పార్టీ సింబలైన గ్లాసుతో తన పెళ్లి శుభలేఖను డిజైన్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ గా జనసేన పార్టీ జెండా తరహాలో తయారు చేయించటం విశేసం.
ఈ నెల (అక్టోబరు) 13న అతడి పెళ్లి హేమలతతో జరగనుంది. విశాఖలో జరిగే ఈ పెళ్లికి తన బంధువులు.. స్నేహితులు.. తెలిసిన వారికి పెళ్లి కార్డులు ఇస్తున్న వేళ.. ఈ కార్డు కథ బయటకు వచ్చింది. ఈ పెళ్లి శేభలేఖ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిజానికి తాము అభిమానించే రాజకీయ.. సినీ హీరోల ఫోటోలతో పెళ్లి శుఖలేఖల్ని చాలామంది తయారు చేసినా.. ఈ తరహాలో తయారు చేసిన ఘనత మాత్రం రాజేష్ రెడ్డికే చెల్లుతుందని చెప్పాలి. మరీ.. పెళ్లికార్డు పవన్ వరకూ వెళితే.. ఆయనే విధంగా రియాక్ట్ అవుతారో?