Begin typing your search above and press return to search.

రెండో జాబితా..అభిమానుల ఉత్సాహంపై పవన్ నీళ్లు!

By:  Tupaki Desk   |   18 March 2019 11:58 AM IST
రెండో జాబితా..అభిమానుల ఉత్సాహంపై పవన్ నీళ్లు!
X
జనసేన రెండో జాబితా రానే వచ్చింది. ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైన నేపథ్యంలో.. జనసేన రెండో జాబితా విడుదల అయ్యింది. ఈ జాబితాలో కూడా పలు నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు పవన్ కల్యాణ్. ఇదే సమయంలో కమ్యూనిస్టు పార్టీలు - బీఎస్పీలకు కూడా సీట్లను ఖరారు చేశారు పవన్ కల్యాణ్.

అనూహ్యంగా బీఎస్పీకి ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లను కేటాయించారు. అసలుకు ఆ పార్టీకి అంత సీనుందా అనేది ప్రశ్నార్థకమే. ఇక కమ్యూనిస్టు పార్టీలకు మరీ చెరో ఏడుతో సరి పెట్టారు. ఆ అంశాల గురించి ఇలా క్లారిటీ ఇచ్చారు.

అయితే..అసలు విషయం ఏమిటంటే రెండో జాబితాలో కూడా పవన్ కల్యాణ్ పేరు లేదు! పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే అంశం మీద రెండో జాబితాలో కూడా క్లారిటీ ఇవ్వలేదు. తొలి జాబితాలో పవన్ కల్యాణ్ పేరు పెట్టి ఉంటే ఆ ఊపే వేరు. జనసేనకు మంచి ఊపు వచ్చేది.

అయితే.. అది జరగలేదు. విశేషంగా రెండో జాబితాలో కూడా పవన్ కల్యాణ్ ఎక్కడ పోటీ చేస్తారనే అంశంపై అభిమానులకు క్లారిటీ ఇవ్వలేదు. దీంతోఈ అంశంపై చర్చ జరుగుతూ ఉంది. పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే అంశంపై క్లారిటీ వస్తే.. జనసేన లో కూడా అస్పష్టత తగ్గుతుంది. అయితే పవన్ మాత్రం ఈ అంశం మీద క్లారిటీ ఇవ్వలేదు.

రెండో జాబితాలో కూడా పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే అంశం మీద క్లారిటీ ఇవ్వకపోవడంతో అభిమానుల్లో నిరుత్సాహం కలుగుతూ ఉంది. ఇంకెప్పుడు? అనే ప్రశ్న వ్యక్తం అవుతూ ఉంది.

ప్రస్తుతానికి అయితే జనసేన అధినేత గాజువాక నుంచి పోటీ చేస్తారని టాక్. ఆ నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ కు తెలుగుదేశం పార్టీ కూడా సహకారం అందించనుందని, అందుకోసమే గాజువాక సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లాను కూడా అక్కడ నుంచి పోటీకి తప్పించారని ప్రచారం సాగుతోంది!