Begin typing your search above and press return to search.
పవన్ రాజకీయంలో లేనిదేంటంటే!
By: Tupaki Desk | 7 Jun 2018 4:36 PM GMTపోరాట యాత్రలో ఉన్న పవన్ కళ్యాణ్ పై వైసీపీ నుంచి టీడీపీలో చేరిన జంపింగ్ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆయనపై ఆమె ఎందుకు అంత సంచలన వ్యాఖ్యలు చేయాలంటే పవన్ ఈరోజు ఆమె నియోజకవర్గంలోనే పర్యటిస్తున్నారు. గూడ గ్రామంలో ఈరోజు మాట్లాడిన పవన్ కళ్యాణ్ అడవుల్లో ఖనిజాలు తవ్వుతూ ప్రకృతిని నాశనం చేయడం అవినీతి కాదా - గూడెం ప్రజల జీవితాలను కబళించడం అవినీతి కాదా అంటూ టీడీపీ ప్రభుత్వ అక్రమాలపై గళమెత్తారు. దీంతో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన గిడ్డి ఈశ్వరి పవన్ పై చిందులు తొక్కారు.
అసలు పవన్ కు సినిమాలు లేక రాజకీయాల్లోకి వచ్చారని వ్యాఖ్యానించిన ఈశ్వరి... పవన్ కు అనుభవం సినిమాల్లో మాత్రమే ఉందన్నారు. రాజకీయాలకు ఆయన పనికిరాడని - రాజకీయాలు చేసే పరిపక్వత పవన్ లో లేదన్నారు. చేతిలో సినిమాల్లేక ఇలా యాత్రలు చేస్తూ జనాన్ని రెచ్చగొడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు.
మరో నెటిజన్ ఆమెపై ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశౄరు. ఒక పార్టీ టిక్కెట్ పై గెలిచి ఇంకో పార్టీలో చేరేంత పరిపక్వ రాజకీయాలు పవన్‌కు తెలియవంటూ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో ఉన్నంత కాలం దుర్మార్గుడిగా కనిపించిన చంద్రబాబు టీడీపీలో చేరిన వెంటనే ఎట్లా మంచోడు అయిపోయాడక్కా అని ఆమెను ప్రశ్నించారు.

ఆమె చేసిన ఒక వ్యాఖ్య వల్ల అందరితో ఆమె విమర్శల పాలవుతోంది. ఆమె ఈ సందర్భంగా చేసిన డామేజింగ్ కామెంట్ ఏంటంటే... *మన్యం అభివృద్ధి చంద్రబాబు పెట్టిన భిక్ష* అన్నారు. దీంతో మండిపడిన నెటిజన్లు అసలు చంద్రబాబుకు అధికారం అనే బిక్షను ప్రజలు వేశారని - అది మరిచిపోయి ఇష్టారాజ్యంగా పరిపాలిస్తున్నారని అన్నారు. ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు జరగడం లేదని గిడ్డి ఈశ్వరి సమర్థించగా... గూడ గ్రామం వెళ్లండమ్మా ... మా పవన్ సాక్ష్యాలు చూపిస్తాడు అంటూ పవన్ ఫ్యాన్స్ వ్యాఖ్యానించారు.