Begin typing your search above and press return to search.

పుట్టిన రోజేమో కానీ ఫ్యాన్స్ పనికి పవన్ కు భారీ డ్యామేజ్

By:  Tupaki Desk   |   2 Sep 2022 12:30 PM GMT
పుట్టిన రోజేమో కానీ ఫ్యాన్స్ పనికి పవన్ కు భారీ డ్యామేజ్
X
తమ అభిమాన నటుడికి.. నాయకుడి పుట్టిన రోజు అంటే.. ఆ ప్రత్యేకమైన రోజును మర్చిపోలేని రీతిలో బహేుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ ఇప్పుడు షాకింగ్ గా మారింది. అభిమానం హద్దులు దాటినా.. ఉత్సాహం అత్యుత్సాహం దశకు చేరుకుంటే ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయన్న దానికి నిదర్శనంగా మారింది పవన్ ఫ్యాన్స్ రచ్చ.

గురువారం రాత్రి కర్నూలులోని థియేటర్ లో జల్సా మూవీ ప్రదర్శన సందర్భంగా పవన్ అభిమానులు చేసిన రచ్చ తెలిసిందే. అయితే.. ఈ ఎపిసోడ్ లో పవన్ అభిమానుల్ని తప్పు పట్టే ముందు.. థియేటర్ యాజమాన్యాన్ని వేలెత్తి చూపించాల్సిన అవసరం ఉంది. పవన్ ఫ్యాన్స్ కు పండుగ లాంటి వేళ.. సినిమా ప్రదర్శనకు సంబంధించి సౌండ్ సిస్టం ఎలా ఉందన్న దానిపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.

ఒకవేళ అనూహ్యంగా సాంకేతిక సమస్యలు వచ్చి ఉంటే.. క్షమాపణలు చెప్పి.. సర్దుబాటు చేస్తే.. ఎంతటి ఫ్యాన్స్ అయినా కామ్ అయ్యే పరిస్థితి. కానీ.. అలాంటిదేమీ చేయని కారణంగా అక్కడి రచ్చ పెద్దది కావటంతో పాటు.. థియేటర్ అద్దాలు పగిలే పరిస్థితి. ఈ ఉదంతాన్ని మర్చిపోక ముందే వైజాగ్ లో పవన్ పుట్టిన రోజు సందర్భంగా లీలా మహల్ లో క్రియేట్ అయిన రచ్చ చూసినోళ్లకు మతి పోతోంది.

సినిమా థియేటర్ లోకి బీర్ బాటిల్స్ తీసుకురావటం.. తాగేసి.. అక్కడ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తాము అమితంగా అభిమానించే  కథానాయకుడి పుట్టిన రోజున.. తమ అభిమానాన్ని ప్రదర్శించేందుకు వీలుగా కాస్తంత క్రమశిక్షణను ప్రదర్శించాల్సిన అవసరం ఉంది.

కానీ.. ఆ విషయాన్ని మర్చిపోయిన పవన్ అభిమానులు వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పు పడుతున్నారు. గొడవ ఎందుకు మొదలైంది? అభిమానులు అంత రచ్చ ఎందుకు చేశారు? అన్న దానిపై ప్రాథమిక సమాచారం లేనప్పటికీ.. అభిమానులు క్రియేట్ చేసిన హంగామా కారణంగా స్కీన్ ను చించేయటం.. సీట్లను చించేయటంతో పాటు.. థియేటర్ ను రచ్చ రచ్చ చేశారు.

పవన్ ఫ్యాన్స్ అత్యుత్సాహానికి రూ.20 లక్షల మేర నష్టం వాటిల్లినట్లుగా చెబుతున్నారు. పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకొని జల్సా మూవీ ప్రత్యేకంగా స్క్రీనింగ్ చేయటం తెలిసిందే. దీనికి పెద్ద ఎత్తున అభిమానులు విరగబడిన వైనం పలుచోట్ల కనిపిస్తోంది. బుక్ మై షో లాంటి యాప్ లలో.. ట్రెండింగ్ సెర్చికు సంబంధించిన వాటిల్లో హైలెట్ గా కనిపిస్తున్న వాటిల్లో జల్సా మూవీ ఉండటం గమనార్హం. పవన్ అభిమానుల అత్యుత్సాహం కారణంగా థియేటర్ మొత్తం రచ్చ రచ్చగా మారిందంటున్నారు.

అభిమానం ఉండాలి కానీ అది మిగిలిన వారికి దురభిమానంగా కనిపించకూడదంటున్నారు. మొత్తంగా తమ అభిమాన హీరోకు తాము చేసే పనుల కారణంగా.. అతగాడి ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా ఉండకూడదన్న మాట వినిపిస్తోంది. పవన్ ను అభిమానించటం.. ప్రేమించటం.. ఆరాధించటం అంటే.. రచ్చ చేయటం కాదన్న విషయాన్ని గుర్తిస్తే మంచిదంటారు. క్రమశిక్షకు మారుపేరుగా ఉండే పవన్ కు ఆయన అభిమానులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.