Begin typing your search above and press return to search.
ఊరికెళుతున్న కత్తిని బైక్స్ తో పీకే ఫ్యాన్స్ ఫాలో!
By: Tupaki Desk | 13 Jan 2018 10:15 AM GMTపవన్ కల్యాణ్ - మహేశ్ కత్తి మధ్య నడుస్తున్న వివాదం ఇప్పట్లో తెగేటట్లు కనిపించట్లేదు. ఓపక్క ఈ ఇష్యూను క్లోజ్ చేయటానికి టాలీవుడ్ కు చెందిన తమ్మారెడ్డి భరద్వాజ.. కోన వెంకట్ లు ప్రయత్నిస్తుంటే.. అలాంటివేమీ వర్క్ వుట్ అయ్యే పరిస్థితులు కనిపించటం లేదని చెప్పాలి.
కొద్దిసేపటి క్రితం మహేశ్ కత్తి ఒక ట్వీట్ చేశారు. పండక్కి ఊరెళుతున్నట్లు పేర్కొన్నారు. తన సొంతూరైన పీలేరుకు వెళుతున్నానని.. తనను పవన్ ఫ్యాన్స్ కొందరు బైక్స్ మీద ఫాలో అవుతున్నారన్నారు. జై పవన్ అంటూ నినాదాలు చేస్తూ తన కారును ఫాలో అవుతున్నట్లు చెప్పాడు.
నేనిప్పుడే మా ఊరు చేరుకున్నా. నేను కారులో మా ఊరికి వస్తుంటే ఇద్దరు వ్యక్తులు జై పవన్ కల్యాణ్ అంటూ అరుస్తూ బైకుల మీద నా కారును ఫాలో అయ్యారని పేర్కొన్నారు. ఇటీవల తిరుపతి.. విజయవాడ.. మదనపల్లి.. పుత్తూరు చెందిన పవన్ అభిమానులు తన గ్రామానికి వచ్చి తన గురించి ఎంక్వయిరీ చేసినట్లుగా పేర్కొన్నారు.
మొత్తానికి తానిప్పుడు ఎక్కడ ఉన్నానన్న విషయాన్ని తాజా ట్వీట్ తో కత్తి చెప్పకనే చెప్పేశారు. ఇక.. మహేశ్ కత్తికి ఏం కాకూడదని పోలీసులు ఆయనకు భద్రత కల్పించాలేమో? పవన్ అభిమానులు తన వెంట పడ్డారని చెప్పటమే మహేశ్ ఉద్దేశమైతే..ఆ విషయాన్ని చెప్పే తీరు వేరుగా ఉంటుంది. అలా కాకుండా.. తాను వెళుతున్న ఊరు పేరును చెప్పటం ద్వారా గొడవలకు ఆహ్వానించినట్లుగా ఉందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.