Begin typing your search above and press return to search.
రోజాను మెచ్చుకున్న పవన్ ఫ్యాన్స్!
By: Tupaki Desk | 4 Sep 2016 11:22 AM GMTవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా కొత్త ప్రశంసను పొందారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సిద్ధాంతపరంగా వైరుధ్యమున్న రోజాను అభినందించారట. అది కూడా తమ నాయకుడిని పేరడీతో విమర్శించినందుకంట. ఈ మాట చెప్పింది స్వయంగా రోజాయే కావడం విశేషం. పవన్ గబ్బర్ సింగ్ కాదు రబ్బర్ సింగ్ అని రోజా విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ విమర్శ అనంతరమే ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ తిరుపతిలో మాట్లాడారని, ఈ విషయం ఆయన ఫ్యాన్స్ ఫోన్ చేసి చెప్తూ తనను అభినందించారని రోజా పేర్కొన్నారు. మీ వల్లే మా నాయకుడు ప్రత్యేక హోదాపై స్పందించారని ఫ్యాన్స్ తనకు చెప్పారని రోజా అన్నారు. మొత్తంగా పవన్ స్పందించడం అభినందనీయమన్నారు. అయితే తమ పార్టీ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం రెండేళ్లుగా పోరాడుతోందని రోజా తెలిపారు.
ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన గొంతు ఎలా రికార్డు చేస్తారంటూ నిస్సిగ్గుగా అడుగుతున్నారని రోజా విమర్శించారు. తాను ఏ తప్పూ చేయకపోయినా అసెంబ్లీ నుంచి తనను ఏడాది పాటు సస్పెండ్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన చంద్రబాబుకు శిక్ష పడాలా వద్దా అని రోజా ప్రశ్నించారు. అసెంబ్లీలో రౌడీయిజం చేసిన అచ్చెన్నాయుడు - బోండా ఉమామహేశ్వరరావులను శిక్షించాలా వద్దా అని అడిగారు. ఎమ్మార్వో వనజాక్షిని కొట్టిన విప్ చింతమనేని ప్రభాకర్ కు శిక్ష వేయాలా వద్దా అని నిలదీశారు. చంద్రబాబు ప్రభుత్వంలో తన వారికి ఒక రూలు - ఎదుటివారికి మరో రూలు అన్నట్లు పరిపాలన సాగుతోందని రోజా విమర్శించారు. ప్రజలు బాబు తీరును గమనిస్తున్నారని, సరైన సమయంలో సరైన తీర్పు ఇస్తారని ఆమె తెలిపారు.