Begin typing your search above and press return to search.
పవన్ వర్సెస్ ప్రభాస్ ఫ్యాన్స్ క్యాస్ట్ వార్
By: Tupaki Desk | 4 Sep 2015 1:12 PM GMTసినిమా స్టార్ల పై అభిమానం శృతిమించితే ఫ్యాన్స్ మధ్య జరిగే గొడవలు సమాజానికి చేటు తెస్తాయనడంలో సందేహం లేదు. దీని వల్ల ఈ గొడవలతో సబంధం లేని సామాన్య ప్రజలు కూడా ఒక్కోసారి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రస్తుతం భీమవరంలో పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతుంది. అక్కడ పవన్, ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య జరిగిన గొడవ రెండు సామాజికవర్గాల వివాదంగా మారిపోయింది. బుధవారం పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉండే ఏరియాల్లో పవన్ భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు.
అంతే కాకుండా చాలా గ్రాండ్ గా పవన్ బర్త్ డే వేడుకలు చేశారు. ప్రభాస్ సామాజకవర్గం అధికంగా ఉండే చోట పవన్ కటౌట్లు పెట్టడంతో ఈ గొడవ స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. ముందుగా పవన్ ఫ్యాన్స్ వర్సెస్ ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్న వివాదం కాస్త తర్వాత కాపు వర్సెస్ రాజుల సామాజికవర్గం మధ్య పోరుగా మారిపోయింది. తర్వాత కొందరు పవన్‌కళ్యాణ్ ఫ్లెక్సీలను చించివేస్తే..తర్వాత మరో వర్గం వారు ప్రభాస్ కటౌట్లను ధ్వంసం చేసి...ఫ్లెక్సీలను చించి నిప్పుపెట్టారు.
ఈ గొడవలో ఒకరినొకరు ఏకంగా రాళ్లతో కొట్టుకుంటూ ప్రైవేట్ ఆస్తులను కూడా ధ్వంసం చేశారు. అభిమాన సంఘాల ఆందోళనలు, ధర్నాలతో భీమవరం భగ్గుమంది. మనం తెరమీద సినిమలు చూసి కాస్త కాలక్షేపం చేసే హీరోల కోసం ఇంత సీన్ అవసరమా ? వందల కోట్లు వసూళ్లు చేస్తున్న తెలుగు సినిమా హాలీవుడ్ రేంజ్ కి వెళుతుంటే… హీరోల ఫ్యాన్స్ మాత్రం తమ హీరో గొప్ప అంటే తమ హీరొ గొప్ప ని కొట్టుకుంటూ ..దాడులు చేసుకునే నీచ స్థితికి రోజురోజుకు దిగజారిపోతున్నారు.
బుధవారం రాత్రి పోలీసులు రంగప్రవేశం చేయడంతో గొడవ సద్దు మణిగినా గురువారం ఉదయం మళ్లీ రాజుకుంది. చివరకు జిల్లా ఎస్పీ సూచనల మేరకు శుక్ర, శనివారాల్లో కూడా 144 సెక్షన్ విధించారు. ఈ గొడవపై ఇంతవరకు ప్రభాస్, పవన్ కూడా స్పందించలేదు. ఇక పోలీసులు కూడా ఆస్తులు ధ్వంసం చేసింది ఎవరనే కోణంలో విచారిస్తున్నారు.