Begin typing your search above and press return to search.
చంద్రబాబు తాట తీస్తున్న పవన్
By: Tupaki Desk | 5 Nov 2018 11:07 AM GMTఎన్నికలు దగ్గర పడేకొద్దీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యర్థుల తాకిడి పెరిగిపోతోంది. ఆయన ఇమేజ్ అంతకంతకూ పడిపోతోంది. ఓవైపు ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్.. మరోవైపు మాజీ మిత్ర పక్షం జనసేన చంద్రబాబును ఆటాడుకుంటున్నాయి. జగన్ మీద దాడి ఉదంతం కొన్ని రోజుల పాటు బాబును ఉక్కిరి బిక్కిరి చేయగా.. ఆ తర్వాత రాహుల్ గాంధీతో ములాఖత్ చంద్రబాబు ఇమేజ్ ను బాగా డ్యామేజ్ చేసింది. మామూలుగా సామాజిక మాధ్యమాల్లో తెలుగుదేశం పార్టీది పైచేయిగా ఉంటుంది. ప్రత్యర్థులపై దాడికి సోషల్ మీడియాను ఆ పార్టీ బాగా వాడుకుంటూ ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం తెలుగుదేశం పార్టీకి.. చంద్రబాబుకు సామాజిక మాధ్యమాల్లో తాకిడి మామూలుగా లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి చంద్రబాబు తీరును ట్విట్టర్లో ఎండగట్లేస్తున్నాడు.
ఒకప్పుడు ఆప్తమిత్రుడిగా ఉన్న పవనే.. ఇప్పుడు చంద్రబాబు లోపాల్ని ఎత్తి చూపిస్తూ ట్విట్టర్లో ఆయన పరువును బజారున పెట్టేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు ఎన్ని సందర్భాల్లో ఎలా ఎలా తిట్టాడో చెబుతూ ఒక వార్తాంశం తాలూకు పోస్టర్ ఇప్పుడు ట్విట్టర్లో వైరల్ అవుతోంది. దాన్ని పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసి.. ఇదేంటని ప్రశ్నించారు. చంద్రబాబు మాటలతో జనాల మీద అఘాయిత్యం చేయడం మానుకోవాలని హితవు పలికాడు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు సమీపంలో భూకంపం వస్తే నెర్రెలు చీలినట్లుగా రోడ్డు చీలిపోయిన ఫొటో షేర్ చేసి.. దీనికి సమాధానం చెప్పమన్నాడు పవన్. అంతే కాక.. తాను ట్విట్టర్లో ఫాలో అవుతున్న ఏకైక సెలబ్రెటీ.. బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ చేసిన ఒక ట్వీట్ ను బాబుకు ముడిపెట్టి ఆయన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం కూడా చేశాడు పవన్. తాను చెప్పే అబద్ధాల్ని కూడా నిజాలుగా నమ్మే వ్యక్తితో వాదించడం అనవసరం అంటూ అమితాబ్ పెట్టిన ట్వీట్.. చంద్రబాబుకు బాగా సరిపోతుందని పవన్ పేర్కొనడం విశేషం.