Begin typing your search above and press return to search.
వెల్ కం ఆర్కే: బట్టలూడదీసి మాట్లాడుకుందాం..
By: Tupaki Desk | 22 April 2018 6:44 AM GMTజనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ట్వీట్ల వార్ ను మరింత పెంచేశారు. టీవీ9 రవిప్రకాశ్.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ లపై ఆయన గురి పెట్టారు. ఈ రోజు ఉదయం నుంచి వీరిద్దరిపైనా ఘాటు ట్వీట్లు చేయటం షురూ చేశారు.
శనివారం మొత్తం టీవీ9 రవిప్రకాశ్ లక్ష్యంగా పవన్ ట్వీట్లు సాగితే.. ఆదివారం ఉదయం నుంచి ఆంధ్రజ్యోతి ఆర్కే మీద ట్వీట్ల వార్ ను మొదలెట్టారు. ఆర్కే.. ప్లీజ్ వెల్ కమ్ టూ బట్టలూడదీసి మాట్లాడుకుందాం.. బట్టలూడదూసి కొడదాం అంటూ పేర్కొన్న పవన్.. దానికి బీఎంబీకే ప్రోగ్రామ్ గా షార్ట్ చేశారు. ఆంధ్రజ్యోతి నడుపుతున్నావా.. టీడీపీ జ్యోతి నడుపుతున్నావా? అంటూ సూటిగా ప్రశ్నించిన పవన్.. నీ పేపర్ ఆంధ్రులకు సంబంధించింది అయితే కాదని.. అందుకు కొద్దివారాల్లో ఒక స్పష్టత వస్తుందని పేర్కొనటం గమనార్హం.
అదే సమయంలో టీవీ9 సీఈవో రవిప్రకాశ్ పై చెప్పుతో దాడి జరిగిందని..తమ గ్రౌండ్ స్టాఫ్ నుంచి వచ్చిన ఫ్రెష్ అప్డేట్ గా వెల్లడించారు. అయితే.. ఈ న్యూస్ క్లిప్ పాతది కావటం గమనార్హం. ఈ న్యూస్ క్లిప్ లో టీవీ9 రవిప్రకాశ్ పైన చెప్పుతో దాడి అని.. కొట్టింది ఆ ఛానల్ మాజీ విలేకరి అని ఉంది. ఇలా.. ఒకటి తర్వాత ఒకటిగా పవన్ చేస్తున్న ట్వీట్లలో కొత్త విషయాలేమీ లేకపోవటం.. పాతవే ఉండటం చూస్తుంటే.. తనను తప్పుపడుతున్న వాళ్లను..తన ఇమేజ్ డ్యామేజ్ చేసేలా ప్రయత్నం చేసినట్లుగా భావిస్తున్న మీడియా సంస్థల్ని ఏదో ఒక విషయంపై చర్చకు పెట్టేలా పవన్ ట్వీట్లు ఉన్నాయని చెప్పక తప్పదు. మరోవైపు.. పవన్ తీరును పలు పాత్రికేయ సంఘాలు తప్ప పడుతున్నాయి.
ఇదిలా ఉంటే.. మొన్న ఫిలింనగర్ క్లబ్ దగ్గర ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వాహనాలపై దాడి చేసిన పవన్ అభిమానుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.