Begin typing your search above and press return to search.
తెలంగాణ మిర్చి రైతుల కోసం పవన్ గళం
By: Tupaki Desk | 5 May 2017 1:04 PM GMTకేంద్ర ప్రభుత్వం తీరుపై జనసేన పార్టీ అధినేత - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఇక్కట్లలో ఉన్న మిర్చి రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ కేంద్రం తీరును తప్పుపట్టారు. మిర్చి కొనుగోలులో వివక్ష వద్దని కోరుతూ ఆయన తాజాగా పత్రికా ప్రకటన విడుదల చేశారు.
పవన్ విడుదల చేసిన ప్రకటన ఇది....``మిర్చికి మద్దతు ధరగా అయిదు వేల రూపాయలను కేంద్రం ప్రకటించడం శోచనీయం. రైతు కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవలసిన భాద్యత నుంచి ప్రభుత్వాలు తప్పించుకోరాదు. పారిశ్రామిక వేత్తలకు లక్షలాది కోట్ల రూపాయలను వివిధ రూపాల్లో సబ్సిడీలుగా అందిస్తూ వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్న ప్రభుత్వాలు, మరి రైతుల దగ్గరకు వచ్చేసరికి వారు కుంగిపోతున్నా ఎందుకు కరుణ చూపడం లేదు? కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మిర్చి కొనుగోలులో వివక్ష చూపడం తగదు. ఆంధ్రప్రదేశ్ లో 88300 మెట్రిక్ టన్నుల కొంటున్న కేంద్ర ప్రభుత్వం, తెలంగాణాలో 33700 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రకటించడం ఎంతవరకు సబబు.? తెలంగాణ రైతుల వద్ద ఇంకా లక్షల టన్నుల సరుకు ఉందన్న సంగతిని పాలకులు గుర్తించాలి. రెండు రాష్ట్రాలను సమానంగా చూడండి. తెలుగు ప్రజల మధ్య తగవులు పెట్టవద్దని జనసేన కోరుతోంది. రెండు రాష్ట్రాలలోను మద్దతు ధరను పెంచి, తెలంగాణలోనూ 88300 మెట్రిక్ టన్నుల మిర్చిని కొనుగోలు చేయాలని జనసేన డిమాండ్ చేస్తోంది.`` అని స్పష్టం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/