Begin typing your search above and press return to search.
బాబు వచ్చాక చినబాబుకే జాబ్ వచ్చిందట!
By: Tupaki Desk | 3 July 2018 5:05 AM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. గడిచిన కొద్ది నెలలుగా చంద్రబాబు అండ్ కో మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. నాలుగేళ్ల ఆయన పాలనలో తప్పుల్ని ఎత్తి చూపిస్తున్న పవన్ పై తెలుగు తమ్ముళ్లు ఎదురుదాడి షురూ చేయటం తెలిసిందే. దీనికి తగ్గట్లే పవన్ సైతం తన మాట దాడిని మరింత పెంచారు. ఈ క్రమంలో ప్రాంతీయ విద్వేషాల్ని రెచ్చగొడుతున్నట్లుగా పవన్ పై తమ్ముళ్లు విరుచుకుపడుతున్నారు.
తన మీదా.. తన మాటల మీదా టార్గెట్ చేస్తున్న తెలుగు తమ్ముళ్లపై పవన్ మండి పడ్డారు. బాబు వస్తే జాబ్ వస్తాయన్న మాటను చంద్రబాబు చెప్పారని.. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ముఖ్యమంత్రి బాబుకే జాబ్ వచ్చిందంటూ లోకేశ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ప్రాంతీయ అసమానతల మీద మాట్లాడుతుంటే విద్వేషాలు రెచ్చగొడుతున్నట్లుగా చెప్పటం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించిన పవన్.. పట్టిసీమకు రూ.2వేల కోట్లు ఇచ్చినప్పుడు.. విజయనగరం జిల్లాలోని 8 లక్షల ఎకరాలకు నీరిచ్చే బాబూ జగ్జీవన్ రామ్ ఎత్తిపోతల పథకానికి డబ్బులు ఇవ్వమని చెప్పటం ప్రాంతీయ అసమానతల కిందకు రాదా? అంటూ ఫైర్ అయ్యారు.
మీరు అసమానతలు సృష్టించి.. తమను విద్వేషాలు రెచ్చగొడుతున్నట్లుగా వ్యాఖ్యానించటం ఏమిటని ప్రశ్నించిన పవన్.. ఉత్తరాంధ్రలో ఎక్కడ చూసినా నిరుద్యోగమే కనిపిస్తోందన్నారు. శ్రీకాకుళం వచ్చి పోరాటం ప్రారంభిస్తే నిరుద్యోగ భృతి ప్రకటిస్తున్నారని.. వారికి కావాల్సింది ఉద్యోగమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
ప్రతి ఉద్యోగాన్ని కాంట్రాక్ట్ పద్దతిలో ఔట్ సోర్సింగ్ చేస్తున్నారని.. ఒక్కో ఉద్యోగానికి తెలుగుదేశం నేతలు రూ.5 లక్షల నుంచి రూ.8లక్షలకు అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్రకు చెందిన 23 కులాల వారు హైదరాబాద్ లో స్థిరపడితే.. తెలంగాణ ప్రభుత్వం వారిని బీసీ జాబితాలో లేరని.. దీనిపై ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అసలు పట్టించుకోవటం లేదన్నారు. ఈ విషయాన్ని తానే స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడతానని చెప్పారు. బాబు వైఫల్యాలపై వరుసపెట్టి విమర్శలు గుప్పిస్తున్న పవన్ మాటలతో తెలుగు తమ్ముళ్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.