Begin typing your search above and press return to search.
ఎవరు ఎవరితో పడుకున్నా పవనే చెప్పాలి!!
By: Tupaki Desk | 27 Sept 2018 10:46 AM ISTఎప్పుడూ లేనట్లుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీడియాపైన విరుచుకుపడ్డారు. దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే.. ఏపీ ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడటం తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాపైనా ఆయన వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తన పార్టీ చేపట్టిన విరాళాల సేకరణ కార్యక్రమాన్ని స్టింగ్ ఆపరేషన్ అంటూ హడావుడి చేసి అడ్డంగా బుక్ అయిన మీడియా ప్రముఖుడి ముచ్చట తెలిసిందే.
ఇదే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. నిజంగా స్టింగ్ ఆపరేషన్లు చేయాలంటూ ఇలాంటి రౌడీ వెధవలపైన చేయొచ్చుగా ఉంటూ చింతమనేనిని పరోక్షంగా ప్రస్తావించారు. కానీ.. మీడియా అలా చేయదని.. ఎందుకంటే దానికి భయమన్నారు.
రౌడీ వెధవలపై ఫోకస్ చేయకుండా పవన్ అనే ఒకడిపైనే ఎందుకు ఫోకస్ పెడుతోందని ప్రశ్నించారు. ఎవరు ఎవరితో పడుకున్నా పవనే సమాధానం చెప్పాలి.. నా బతుకిలా అయిపోయిందంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. మీరూ.. మీరూ పడుకుంటే నేనేం చేయాలంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిన జనసేనాధినేత దానిపై ప్రోగ్రాంలు.. ఆర్నెల్లు.. ఏడాది నడుపుతూ టీఆర్ పీలు పెంచుకుంటున్నారంటూ మీడియా తీరును తీవ్రస్థాయిలో తప్పు పట్టారు.
ప్రతి విషయంలోనూ తనను అనవసరంగా లాగుతున్న మీడియా సంస్థలు.. చింతమనేని లాంటి రౌడీల గురించి కార్యక్రమాలు ఎందుకు చేయరంటూ క్వశ్చన్ చేశారు. ఎందుకంటే..ఇలాంటి వారంటే భయమని.. మీడియా వారితో పెట్టుకోవటానికి భయపడుతుందంటూ ఫైర్ అయ్యారు. మొత్తానికి మీడియాలో కొందరు చేసిన పనుల్ని.. మొత్తం మీడియాకు ఆపాదించటం ఏమిటి పవన్..?