Begin typing your search above and press return to search.
పోలీసులపై పవన్ కళ్యాణ్ వీరావేశం.. వైరల్ వీడియో
By: Tupaki Desk | 2 Oct 2021 8:26 AM GMTజనసేనాని పవన్ కళ్యాణ్ రాజమండ్రి పర్యటన ఆద్యంతం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఇప్పటికే జనసేన కార్యకర్తలు.. పోలీసులను దాటుకుంటూ ముందుకు సాగుతున్నారు.
ఇక తన పర్యటనకు అడుగడుగునా అడ్డుకుంటున్న పోలీసులపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. కారుపైకి ఎక్కి.. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వాళ్లను అడ్డుకోవద్దని హెచ్చరించారు.
ఏపీలోని రెండు జిల్లాల్లో ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రమదానం చేపట్టనున్నారు. ఇందులో భాగంగానే ఆయన రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో పవన్ కు జనసేన శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్రంలోని రహదారుల దుస్థితిపై నిరసనలో భాగంగా జనసేన ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే..
తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ రహదారిపై పవన్ శ్రమదానం చేయాలని నిర్ణయించారు. కానీ భద్రతా కారణాలతో ఈ కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. అధికారుల సూచనతో హుకుంపేట-బాలాజీపేట రోడ్డుకు ఈ కార్యక్రమాన్ని మార్చారు.
రాజమండ్రి విమానాశ్రయం నుంచి పవన్ బాలాజీపేటకు భారీ కాన్వాయ్ తో బయలు దేరారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, ప్రజలకు అభివాదం చేశారు. పోలీసులు అడ్డుకుంటుండడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పవన్ కారుపైకి ఎక్కి మరీ పోలీసులను హెచ్చరించిన వీడియో వైరల్ గా మారింది.