Begin typing your search above and press return to search.
శ్రీని - రాధాకృష్ణ...ఆ వీడియోను మీ ఇంట్లో ఆడోళ్లకి చూపండి
By: Tupaki Desk | 21 April 2018 11:44 AM GMTనా తల్లి గౌరవానికి నేను రక్షణ కల్పించలేని పక్షంలో నా బతుక్కే అర్థం లేదని బాధపడి... తన కుటుంబాన్ని తీవ్రంగా అవమానించిన వారిపై యుద్ధం ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఆ ఆవేదనపూరిత బాధ నుంచి ఇంకా బయటపడనే లేదు. గంటగంటకూ ఆయన నుంచి ట్వీట్లు వస్తున్నాయి. ప్రతి ట్వీట్‌లోనూ పవన్ ఆవేదన కనిపిస్తోంది.
శ్రీరెడ్డి తన తల్లిని చేసిన దూషణను టీవీ9లో టెలికాస్ట్ అయిన వీడియో సహితంగా తాజాగా పవన్ కళ్యాణ్ తన ట్విట్టరులో షేర్ చేశారు. శ్రీనిరాజు ... ఇదిగో మీ టీవీ9లో వచ్చిన వీడియో. నీ తల్లికి, భార్యకు, కూతురికి చూపించి టీవీ9 సాధించిన ఘనతను వారికి వివరించు అంటూ ట్వీట్ చేశారు. అలాగే ఈ ప్రసారం ద్వారా నీ ఆదాయం ఎలా పెరిగిందో కూడా చెక్ చేసుకో అంటూ పేర్కొన్నారు. అనంతరం టీవీ9 రవిప్రకాష్ నీ కోసం ప్రత్యేకంగా వేరే ట్వీట్ పెడతా. వెయిట్ చేయండి. మిమ్మల్ని వెయిట్ చేయిస్తున్నందుకు నన్ను క్షమించండి అంటూ వ్యాఖ్యానించారు.
ఇక తాజాగా రాధాకృష్ణను కూడా పవన్ కళ్యాణ్ వదల్లేదు. ఓపెన్ హార్ట్ ఆర్కే. నువ్వు నేను పెట్టిన వీడియోచూడు. నన్ను నా తల్లిని తిట్టించడానికి సృష్టించిన టీడీపీ డ్రీమ్ టీమ్‌లో నువ్వు కూడా సభ్యుడే. దాన్ని లోకేష్ కి చూపించు. అలాగే నీ స్నేహితులకు - సీఎంకు - మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్లకు చూపించు. అవును... ఈ వీడియోపై వారి అభిప్రాయాన్ని తీసుకుని మీ ఛానెల్లో ప్రసారం చేయొచ్చు కదా? ఎందుకు చేయట్లేదబ్బా? అంటూ పవన్ ప్రత్యేక ట్వీట్ లో ఆర్కేపై వ్యాఖ్యలు చేశారు.
మొత్తానికి మీడియాపై పవన్ ఏకంగా భారీ యుద్ధమే ప్రకటించారు. మొన్నటి అర్ధరాత్రి మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ యుద్ధం ఇంకా కొనసాగుతోంది.