Begin typing your search above and press return to search.

ప్యాకేజీ అంటే చెప్పుతో కొడతా నా కొడకల్లారా?: పవన్‌ ఉగ్రరూపం!

By:  Tupaki Desk   |   18 Oct 2022 9:30 AM GMT
ప్యాకేజీ అంటే చెప్పుతో కొడతా నా కొడకల్లారా?: పవన్‌ ఉగ్రరూపం!
X
జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఉగ్రరూపం దాల్చారు. వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. ఒరేయ్‌ దద్దమ్మల్లారా, సన్నాసుల్లారా, చవటల్లారా, వెధవల్లారా, వైసీపీ గూండాగాళ్లారా ఇంకోసారి ప్యాకేజీ అంటే చెప్పుతీసుకుని దవడ పళ్లు రాలగొడతా అంటూ ఉద్రేకంతో ఊగిపోయారు. ఇంకోసారి ప్యాకేజీ అని కూస్తే చెప్పు తెగుతుంది అంటూ తన కాలి చెప్పు తీసి చూపించారు.

వైసీపీ దగ్గర గూండాలున్నారా.. క్రిమినల్స్‌ ఉన్నారా.. రౌడీలు ఉన్నారా.. ఒక్కడినే వస్తా.. గొంతు పిసికి కింద పాతేస్తానంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తనకు భాష రాదనుకుంటున్నారా అని మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం విశాఖపట్నంలో జనవాణి కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం పోలీసులను పెట్టి అడ్డుకోవడం, తనను ర్యాలీ చేయనీయకుండా, తనను ఎవరూ కలవనీయకుండా చేయడం, తన అభిమానులు, జనసేన శ్రేణులపై లాఠీచార్జ్‌ చేయడం, వందమందికి పైగా జనసేన నేతలను విశాఖ నోవాటెల్‌లో అర్ధరాత్రి పోలీసులు ప్రవేశించి అరెస్టులు చేయడం, విశాఖ వదిలివెళ్లాలని తనకు నోటీసులు జారీ చేయడం తదితరాలపై పవన్‌ కల్యాణ్‌ నిప్పులు చెరిగారు. జగన్‌ ప్రభుత్వాన్ని ఓ రేంజులో ఏకిపడేశారు.

ఈ మేరకు గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్‌ కల్యాణ్‌ అక్టోబర్‌ 18న మంగళవారం పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీకున్న మూడు బ్యాంకు ఖాతాల్లో ఎంత నగదు ఉంది.. అభిమానులు, పార్టీ శ్రేణులు ఎంత విరాళాలు ఇచ్చింది ఆయన వివరించారు. ఈ క్రమంలో ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయిన పవన్‌ వైసీపీ గూండాగాళ్లారా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనను ప్యాకేజీ స్టార్‌ అని పలువురు మంత్రులు, వైసీపీ చోటామోటా నేతలు మొదటి నుంచి ఆరోపిస్తుండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడకల్లారా ఇంకోసారి ప్యాకేజీ అంటే చెప్పు తీసుకుని కొడతానంటూ వార్నింగ్‌ ఇచ్చారు.

దేవుడి దయతో తాను సీఎం కావాలనుకుంటున్నానని తాను ముఖ్యమంత్రిని అయితే మొదటి అభివృద్ధి, ఆ తర్వాత వైసీపీ నేతల తాట తీయడం.. ఈ రెండు పనులు చేస్తానని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. దేవుడి దయతో ముఖ్యమంత్రిని కావాలనుకుంటున్నానని చెప్పారు.

నాకు మీలాంటిభాష రాదు..ఎందుకంటే నాకు సంస్కారం ఉంది కాబట్టే నేను మాట్లాడటం లేదు. కానీ నా సహనానికి కూడా ఓ హద్దు ఉంది. ఇష్టానుసారంగా నాపై విమర్శలు చేస్తే నేను లండన్‌ లో పెరగలేదు.. మీలాగా మాట్లాడటం నాకు రాదు అనుకుంటున్నారా? మాట్లాడగలను కానీ నాకు సంస్కారం ఉంది అందుకే మాట్లాడటం లేదు. ఇప్పటికైనా బూతులు మాట్లాడటం మానకపోతే మీలాంటివారిని ఎలా అణచాలో నాకు తెలుసు అంటూ పవన్‌ వైసీపీ నేతలపై మండిపడ్డారు.

నేను బాపట్లలో పెరిగా.. ఉప్పూ కారం తిని పెరిగా.. మీ ఇష్టమొచ్చినట్లుగా బూతులు మాట్లాడితే చూస్తూ ఊరుకోను. బదులు చెబుతా.. చెప్పు తీసుకుని పళ్లు రాలగొడతా ఒక్కో సన్యాసిని అంటూ పవన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాను ఎనిమిదేళ్ల కాలంలో 6 సినిమాలు చేశానన్నారు. రూ.100 కోట్లు సంపాదించా. మీలాగా ప్రజల్ని దోచుకోలేదు. కష్టపడి సంపాదించాను. అటువంటినన్ను ప్యాకేజీలు తీసుకునే వ్యక్తిని అని విమర్శించటానికి మీలాగా సంస్కారం లేకుండా పెరగలేదు అంటూ ధ్వజమెత్తారు. నేను సంపాదించిన ప్రతీ రూపాయికి న్యాయంగా ఆదాయపన్ను కట్టాను. మీలాగా ఎగ్గొట్టలేదు. రూ.33 కోట్ల 37 లక్షల ట్యాక్స్‌ కట్టానని..అదనంగా జీఎస్టీ కూడా కట్టానని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు.

2021–2022లో రూ.55 కోట్లు పార్టీకి ఫండ్‌ గా ఇచ్చానని.. నేను సిద్ధాంతాలు, విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాను తప్ప మీలాగా అడ్డగోలుగా.. బూతుల రాజకీయాలు చేయను అంటూ తెలిపారు.

మాట్లాడితే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారంటూ చేసే వైసీపీ నేతల వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు జనసేనాని. మాట్లాడితే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని అంటున్నారని… మీరు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోండిరా ఎవడొద్దన్నాడు? నేను భార్యకు విడాకులు ఇచ్చి మరో వివాహం చేసుకున్నాను..మీలాగా భార్యను ఇంట్లో ఉంచుకుని ముగ్గురు నలుగురు స్టెఫ్నీలను పెట్టుకోలేదంటూ దుయ్యబట్టారు. తొలి భార్యకు రూ. 5 కోట్లు ఇచ్చానని, రెండో భార్యకు మిగతా ఆస్తి ఇచ్చానని ఆ తర్వాత మూడో పెళ్లి చేసుకున్నానని, విడాకులు తీసుకుని పెళ్లి చేసుకున్నానని చెప్పారు. ఒక్క పెళ్లి చేసుకొని 30 మంది ప్టెపినీలతో తిరిగే మీకేందిరా నేను సమాధానం చెప్పేది అంటూ వైసీపీ నేతలను ఎండగట్టారు పవన్. బూతులు తిట్టే ఒక్కో వైసీపీ నేతను చొక్కా పట్టుకుని ఇళ్లలోంచి లాక్కొచ్చి కొడతా కొడకల్లారా అంటూ తీవ్రంగా హెచ్చరించారు.

మీరు క్రిమినల్ పాలిటిక్స్ చేస్తారు..నేను మాత్రం బలమైన సిద్ధాంతాలతో కూడిన రాజకీయాలు చేస్తానని స్పష్టం చేశారు. యుద్ధానికి సిద్ధమని మీరు చెపితే… రాళ్లా, హాకీ స్టిక్సా దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. ఎంతమంది వైసీపీ గూండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారో రండిరా ఛాలెంజ్ విసురుతున్నా అంటూ ఛాలెంజ్ చేశారు. ఇప్పటి వరకు పవన్ మంచితనం, సహనం చూశారని… ఈరోజు నుంచి యుద్ధమేనని స్పష్టం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.