Begin typing your search above and press return to search.
పవన్ నామినేషన్ కు ముహూర్తాలు ఖరారు!
By: Tupaki Desk | 20 March 2019 7:42 AM GMTజనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నామినేషన్లకు ముహూర్తాలు ఫిక్స్ అయ్యాయి. రెండు నియోజకవర్గాల్లో రెండు రోజుల పాటు వరుసగా నామినేషన్లు వేయనున్నారు. ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలను బలంగా నమ్ముకున్న పవన్ అటే తిరుగుతున్నారు. ఉత్తరాంధ్రలో ఒకసీటు - గోదావరిలో ఒకసీటు ఆయన తన పోటీకి ఎంచుకున్నారు. 21 - 22 తేదీల్లో ఆయన నామినేషన్లు దాఖలు చేస్తారు.
తొలుత మార్చి 21న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.00 గంట మధ్య గాజువాకలో పవన్ తన తొలి నామినేషన్ దాఖలు చేస్తారు. రాజకీయ నాయకుడిగా ఆయన తొలి నామినేషన్ ఇదే. భీమవరంలో మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత నామినేషన్ వేస్తారు. కరెక్ట్ నామినేషన్ టైం పెట్టకపోవడం చూస్తే... ఆ రెండు రోజులు ఆ నియోజకవర్గాల్లో జనసేనాని సత్తా ఏంటో చూపాలని పార్టీ డిసైడ్ అయ్యినట్లు కనిపిస్తోంది. నియోజకవర్గ కేంద్రాలను జనంతో నింపేసి కార్యకర్తల్లో ఒక ఊపు తేవాలని పార్టీ డిసైడ్ అయినట్టుంది.
ఈ రెండు నియోజకవర్గాలు ఎంచుకోవడానికి ఒక కారణం కూడా వెల్లడించారు పవన్. విశాఖ తన సినిమా జీవితానికి ఓనమాలు నేర్పితే - భీమవరం తనకు జీవిత పాఠాలు నేర్పిందట. అందుకే ఈ రెండు నియోజకవర్గాల్లో నిలబడినట్లు వివరించారు. మరి అలాంటపుడు రెండు చోట్ల గెలిస్తే పవన్ ఎవరికి హ్యాండిస్తారో చెప్పలేదు. ఎందుకంటే రెండూ గెలిస్తే ఒకటి రాజీనామా చేయాల్సిందే.
ప్రత్యేకతలు -
* గాజువాకలో జనసేనకు లక్ష సభ్యత్వాలు నమోదయ్యాయి. సామాజికవర్గ బలం ఉంది. ఇది ఉత్తరాంధ్రకు ముఖద్వారం వంటిది.
* 1989 నుంచి భీమవరంలో గెలిచిన పార్టీ అధికారంలో ఉంటోంది. ఈ సెంటిమెంట్ వర్కవుట్ అయితే సీఎం అయిపోవచ్చని జనసేనాని నమ్మినట్టుంది. 1989 నుంచి 2014లో వరకు ఇక్కడ గెలిచిన పార్టీలకే రాష్ట్రంలో అధికార పగ్గాలు దక్కాయి.