Begin typing your search above and press return to search.

ఆక్వాపై పవన్ మరో ముందడుగు!

By:  Tupaki Desk   |   22 Nov 2016 6:53 AM GMT
ఆక్వాపై పవన్ మరో ముందడుగు!
X
పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రులో నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌ పార్కుకు వ్య‌తిరేకంగా చేస్తున్న ఆందోళ‌న రూపుమారుతోంది. ఇక్క‌డ పార్క్ నిర్మించ‌వ‌ద్దంటూ ఇప్ప‌టికే స్థానికులు ఆందోళ‌న చేస్తూ కొద్దికాలం క్రితం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ను హైద‌రాబాద్ వ‌చ్చి క‌లిసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వారికి భ‌రోసా ఇచ్చిన ప‌వ‌న్ తాను క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే. ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న స‌న్నాహ‌కాల్లో భాగంగా భీమవరంలో జనసేన బృందం పర్యటించనుంది. పర్యటనలో భాగంగా ఆక్వా పార్కు బాధితులతో జ‌న‌సేన బృంద స‌భ్యులు సమావేశం కానున్నారు.

జ‌న‌సేన వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం తాజాగా ప‌ర్య‌టించ‌నున్న బృంద స‌భ్యులు ఆక్వాఫుడ్ పార్క్ బాధితుల‌తో స‌మావేశం అవుతారు. వారి అభిప్రాయాలు విని వాటిని ప‌వ‌న్ కు నివేదిస్తారు. భాధితుల‌తో మాట్లాడే సంద‌ర్భంగానే బీమ‌వ‌రంలో ప‌వ‌న్ ప‌ర్య‌టించాల్సిన ఆవ‌శ్య‌త గురించి కూడా జ‌న‌సేన స‌భ్యులు ఆరా తీయ‌నున్న‌ట్లు స‌మాచారం. త‌ద్వారా ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌కు గ్రౌండ్ సిద్ధం చేయ‌నున్న‌ట్లు జ‌న‌సేన వ‌ర్గాలు వివ‌రిస్తున్నాయి. గ‌తంలో అమ‌రావ‌తి ప్రాంత రైతుల ప‌క్షాన మాట్లాడేందుకు క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించిన‌ట్లే...ఆక్వాఫుడ్ బాధితుల కోసం ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న ఉంటుంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు తెలిపాయి.

ఇదిలాఉండ‌గా త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన ఆక్వాఫుడ్ బాధితుల‌తో క‌లిసి హైద‌రాబాద్‌ లో విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఘాటు హెచ్చ‌రిక‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. భీమవరంలో స్థాపించనున్న గోదావరి మెగా ఆక్వాఫుడ్స్‌ సమస్య మరొక నందిగ్రామ్‌ గా మారేలా తయారైందని ప‌వ‌న్ ఆ సంద‌ర్భంగా అన్నారు. పంటలకు అనువుగాని భూములలో స్థాపించాల్సిన పరిశ్రమలను అన్నంపెట్టే గోదావరి జిల్లాలలో స్థాపించడం ఎంత వరకూ సమంజసమని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. అక్కడ ప‌ర్యావ‌ర‌ణ నిబంధ‌న‌ల‌ను పాటించలేదని, పరిశ్రమ పెట్టడానికి పంటలు పండని భూమి తీసుకోవాల‌నే నియ‌మాన్ని కూడా పాటించలేదని ఆయన అన్నారు. ఉభయ గోదావరి జిల్లాలు మనకు అన్నం పెట్టే జిల్లాలని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. ఇటువంటి జిల్లాల్లో నదులను కలుషితం చేసే ఫ్యాక్టరీలు పెట్టడం సరి కాదని ఆయన అన్నారు. రెండున్నరేళ్లుగా అక్కడి ప్రజలు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదో తనకు అర్థం కావడం లేద‌న్నారు. న‌దులను కలుషితం చేసే పరిశ్రమల స్థాపన సరికాదని ప‌వ‌న్ త‌ప్పుప‌ట్టారు. అక్వా ఫుడ్ కోర్టు వద్దని రైతులు ముక్తకంఠంతో కోరుతున్నా పాలకులు ఎందుకు పట్టించుకోవడం లేదో అర్ధం కావడం లేదన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/