Begin typing your search above and press return to search.

అమెరికాకు ప‌వ‌న్‌...మొత్తం షెడ్యూల్ ఇదిగో

By:  Tupaki Desk   |   8 Feb 2017 4:17 PM GMT
అమెరికాకు ప‌వ‌న్‌...మొత్తం షెడ్యూల్ ఇదిగో
X
జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అమెరికా టూర్‌, హార్వ‌ర్డ్‌లో ఆయ‌న ప్ర‌సంగంపై సర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ టూర్ లో ప‌వ‌న్ ఎక్క‌డెక్క‌డ ప‌ర్య‌టించ‌నున్నారు, ఏం మాట్లాడ‌నున్నార‌నే దానికి క్లారిటీ వ‌చ్చింది. జ‌న‌సేన పార్టీ అధికారిక స‌మాచారం ప్ర‌కారం.. ఐదురోజల పర్యటన కోసం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అమెరికా చేరుకున్నారు. భారత కాలమానం ప్రకారం ఈ రోజూ సాయంత్రం 6.45 గంటలకు (బోస్టన్ లో ఉదయం 7.40) బోస్టన్ నగరంలోని అంతర్జాతీయ విమానయాశ్రయంలో అడుగుపెట్టారు. ఈ రోజ అక్కడ హోటల్లో విశ్రాంతి తీసుకుంటారు ఈ నెల 9 నుంచి 12 వ తేది వరకు పవన్ కళ్యాణ్ ఐదు రోజలు వివిధ సమావేశాల్లో పాల్గొనడంలతోపాటు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్ధించిన వివిధ రంగాల ప్రముఖులు,శాస్త్రవేత్తలు, ఐటీ నిపుణులను కలుసుకుంటారు.

లొమ్మిదో తేదీ ఉదయం పది గంటలకు (బోస్టన్ కాలమానం) న్యూక్లియర్ అండ్ యాంటి న్యూక్లియర్ ప్రొఫెసర్ మాధ్యూబన్ లలో గంటసేపు ప‌వ‌న్ క‌ళ్యాణ్ చర్చలు జరుపుతారు. ఎనర్జీ పాలసీ రూపకల్పనలో నిపుణుడైన ప్రొఫసర్ హెన్రీలీ లో 11 నుంచి 12 గంటల వరకు సంభాషిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ కోర్సులు నిర్వహిస్తున్న EDX సంస్థ CEO అనంత్ అగర్వాల్ లలో మధ్యాహ్నం సమావేశమవుతారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు ఆర్గనైజ్ క్యాంపెయిన్ లో ప్రొఫెసర్ అయిన మార్తల్ గంజ్ లో ప‌వ‌న్ సమావేశం ఉంటుంది. పదో తేదీ ఉదయం 8 గంటలకు బోస్టన్ రాష్ట్రంలోని సీబ్రూక్ న్యూక్లియర్ ప్లాంట్ ను సందర్శించి అక్కడ నిపుణులలో మాట్లాడతారు . సుమారు రెండు గంటల సేపు ప‌వ‌న్ అక్కడ గడుపుతారు. 11.45 నిమిషాలకు కాన్కార్టర్ లోని హాంప్ ఫైర్ సైట్ హౌస్ కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు అమెరికా కాంగ్రెస్ సభ్యులు, సెనేటర్లు, అమెరికా న్యూక్లియర్ పాలసీ రూపకర్తలలలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సర్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ పాల్గొంటారు. రెండు తరువాత హాంప్ ఫైర్ గవర్నర్ లో బెటి అవుతారు. మధ్యాహ్నం 3.30 గంటలకు నార్తర్ హాంప్ ఫైర్ లోని నషువా సిటి చేరుకొని అమెరికన్ కాంగ్రెస్ సభ్యురాలు, తెలుగుఆడపడుచు లత మంగిపూడి గారితో ప‌వ‌న్‌ సమావేశం జరుగుతుంది.

సాయంత్రం నాలుగు గంటలకు నషువా లోని రివర్ యూనివర్సిటీ దగ్గర భారతీయ సంతతివారు నిర్వహిస్తున్న కార్ ర్యాలిలో పాల్గొంటారు. అనంతరం ఎన్నారైలు ఏర్పాటు చేసిన డిన్నర్ రిసెప్టన్ స్థలికి చేరుకుంటారు. అక్కడ పూర్ణకుంభంలో పవన్ కళ్యాణ్ ను స్వాగతిస్తారు. తెలుగు లలిత కళావైభవానికి చిహ్నమైన కూచిపూడి నృత్య ప్రదర్శనను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డెమోక్రాటిక్ రిపబ్లికన్ పార్టీలకు చెందిన సెనేటర్లు, నషువా (NASHUA) మేయర్, ఎన్నారైల‌ను ఉద్దేశించి శ్రీ పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు.

నాలుగో రోజైన 11 వ తేదిన హార్వర్టర్ యూనివర్సిటీ లో "బికమింగ్ జనసేనాని " అనే అంశంపై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదే రోజు రాత్రికి శ్రీ పవన్ కళ్యాణ్ ను గౌరవిస్తూ హార్వ‌ర్డ్ యూనివర్సిటీ డిన్ నితిన్ నోట్రాయా తాజ్ బోస్టన్ లో విందు ఇస్తారు. చివరిరోజైన 12వ తేదిన (బోస్టన్ కాలమానం) హార్వర్టర్ యూనివర్సిటీలో కీనోట్ ప్రసంగం చేస్తారు. సహజంగా ఇక్కడ ఉపన్యాసకులకు అరగంట సేపు మాత్రమే సమయం కేటాయిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ కు సుమారుగా గంట సమయాన్ని నిర్వాకులు కేటాయించడం గమనార్హం. 11, 12 ఇదే సమావేశాల్లో పాల్గొనడానికి భార‌త‌దేశం నుంచి వస్తున్న ఎస్.వై.ఖురేషి -ఒమర్ అబ్దుల్లా - కృష్ణ బైరేగౌడ - శశిథ‌రూర్ - గురురాజ్ దేశ్ పాండే - నితిన్ నోహ్రీయా త‌దిత‌రుల‌తో స‌మావేశం అవుతారు. అదే రోజు సాయంత్రం ఆరున్నర గంటలకు బోస్టన్ నుంచి హైదరాబాద్ కు పవన్ కళ్యాణ్ తిరుగు పయనమవుతారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/